Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

Rc. No. Special /E4/2019 ,Dated : 19-06-2019. DEO East Godavari.

 జిల్లా విద్యా శాఖాదికారి, తూర్పు గోదావరి, కాకినాడ వారి ఉత్తర్వులు
ప్రస్తుతం:- శ్రీ. ఎస్. అబ్రహం, యం.ఎ., యం.యిడి.,
 ఆర్.సి. నెం. స్పెషల్/ఇ4/2019, తేది.19-06-2019
      ▶ విషయం :     పాఠశాల విద్య- తూర్పు గోదావరి- పాఠశాలల యందు నిర్వహించవలసిన కార్యక్రమములు - సూచనలు జారి గురుంచి.
〰〰〰〰〰〰〰〰
              పై విషయమును అనుసరించి, జిల్లాలో పని చేయుచున్న అందరు ఉప విద్యా శాఖాధికారులకు మరియు మండల విద్యా శాఖాధికారులకు తెలియజేయునది ఏమనగా జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు క్రింది తెలిపిన సూచనలు పాటించవలసినదిగా కోరడమైనది._
➤ ప్రతిరోజూ ఉదయం అరగంట పాటు ఆనందవేదిక పీరియడ్ ను ప్రతి తరగతికి మొదటి పీరియడ్ బోధించే క్లాస్ టీచర్ తీసుకోవాలి.
➤ అన్ని యాజమాన్య పాఠశాలలు ప్రతి నెలా 1, 3వ శనివారాలు నో బ్యాగ్ డే గా పాటిస్తూ అకడమిక్ కాలెండర్ లో ఇచ్చిన విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి.
➤ అకడమిక్ కాలెండర్ లో 6, 7, 8 తరగతుల సిలబస్ తగ్గింపు గురించి స్పష్టంగా ఇవ్వబడింది. అయితే NCERT సూచనల ప్రకారం సిలబస్ తగ్గింపు నిర్ణయం జరిగేనాటికే బుక్స్ ప్రింటైనందున అకడమిక్ కాలెండర్ లో తొలగించినట్లు చూపిన పాఠ్యాంశాలు చెప్పనవసరం లేదు.
➤ పదవతరగతిలో ఇంటర్నల్ మార్కులు లేకపోయినా యధావిధిగా ప్రతి సంవత్సరంలాగే FAలు, SA లు నిర్వహించి మార్కులు CSE website లో అప్లోడ్ చేయాలి.
➤ ప్రతీ ఉపాధ్యాయుడు భోదించే 10 పీరియడ్ లలో 4 పీరియడ్ లు ప్రాక్టీసు టీచింగ్ నకు కేటాయించాలి.
➤ తరగతి సిలబస్ ను 160 పనిదినాలలో పూర్తిచేయవలెను.
➤ వారంలో కనీసం 5  పీరియడ్స్ కంటే ఎక్కువ వ్యాయామ విద్యకు కేటాయించవలెను.
➤ సమ్మేటివ్ పరీక్షలు అనంతరం ప్రతీ మండలంలోనూ ఫలితాలపై సమీక్షను నిర్వహించవలెను.
➤ ప్రతీసారీ పరీక్షలు ముగిసిన వారం రోజుల వ్యవధిలో తనిఖీ బృందములు (మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులు,సీనియర్ విషయ ఉపాధ్యాయులు) మండల స్థాయిలోని అన్ని యాజమాన్య పాఠశాలల్ని తనిఖీ చేసి రిపోర్ట్ ను నిర్దేశిత  ప్రొఫార్మాలో DEO ఆఫీసు కి మెయిల్ చేయవలెను.
〰〰〰〰〰〰〰〰
SUGGESTIVE TIME-TABLE
〰〰〰〰〰〰〰〰
DAY - P1 - P2 - P3 - P4 - P5 - P6 - P7 - P8 - P9
〰〰〰〰〰〰〰〰
MONDAY - Ananda Vedika - Telugu - MATHS - ENG - SCI - HIN - SS - SCIENCE REMEDIATION - PHYSICAL LITERACY.

➤ TUESDAY - Ananda Vedika - Telugu - MATHS - ENG - SCI - HIN REMEDIATION - SS - SCIENCE(ENV EDU) - PHYSICAL LITERACY.

WEDNESDAY - Ananda Vedika - Telugu REMEDIATION - MATHS REMEDIATION - ENG REMEDIATION - SCI  REMEDIATION - HIN - SS REMEDIATION - WORK EDU - PHYSICAL LITERACY.

THURSDAY - Ananda Vedika - Telugu - MATHS - ENG - SCI - HIN REMEDIATION - SS - ART EDU - PHYSICAL LITERACY.

FRIDAY - Ananda Vedika - Telugu - MATHS - ENG - SCI - HIN - SS - ART EDU - PHYSICAL LITERACY.

SATURDAY - Ananda Vedika - Telugu REMIDATION - MATHS REMIDATION - ENG REMIDATION - SCI REMIDATION - HIN REMEDATION - SS REMIDATION - MATHS REMIDATION - PHYSICAL LITERACY.
〰〰〰〰〰〰〰〰
పరీక్షల షెడ్యూల్ అకడమిక్ క్యాలెండరు ప్రకారం :
〰〰〰〰〰〰〰〰
మొదటి ఫార్మేటివ్ టెస్ట్:  జూలై నెల చివరి వారం లో  మొదటి ఫార్మేటిప్ టెస్ట్ నిర్వహించి 1 నుండి 10 వ తరగతి  వరకు విద్యార్ధుల మూల్యాంకన వివరాలను పాఠశాల రికార్డు నందు నమోదు చేయవలెను.

రెండవ ఫార్మేటిప్ టెస్ట్:  సెప్టెంబర్ నెల చివరి వారం లో రెండవ ఫార్మేటిప్ టెస్ట్ నిర్వహించి 1 నుండి 10 వ తరగతి వరకు విద్యార్ధుల మూల్యాంకన వివరాలను పాఠశాల రికార్డు నందు నమోదు చేయవలెను.

మొదటి సమ్మేటివ్ టెస్ట్:  6 నుండి 10 వ తరగతి విద్యార్ధులకు 01-11-2019 నుండి 16-11-2019 వరకు. (అక్టోబర్ నెల వరకూ సిలబస్)

మూడవ ఫార్మేటివ్ టెస్ట్: డిసెంబర్ నెల మూడవ వారం లో మూడవ ఫార్మేటివ్ టెస్ట్ నిర్వహించి 1 నుండి 10 వ తరగతి వరకు విద్యార్ధుల
మూల్యాంకన వివరాలను పాఠశాల రికార్డు నందు నమోదు చేయవలెను.

నాల్గవ ఫార్మేటివ్ టెస్ట్:  ఫిబ్రవరి నెల చివరి వారం లో నాల్గవ ఫార్మేటిప్ టెస్ట్ నిర్వహించి 1 నుండి 10 వ తరగతి వరకు విద్యార్ధుల మూల్యాంకన వివరాలను పాఠశాల రికార్డు నందు నమోదు చేయవలెను.

ప్రీ ఫైనల్:  పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్ణయించిన తేదీలలో నిర్వహించవలెను.

రెండవ సమ్మేటిప్ టెస్ట్:   6 నుండి 10 వ తరగతి విద్యార్ధులకు ది. 06-04-2020 నుండి 21-04-2020 వరకూ నిర్వహించవలెను.
〰〰〰〰〰〰〰〰
సం./- ఎస్.అబ్రహం ,
జిల్లా విద్యా శాఖాదికారి,
తూర్పు గోదావరి, కాకినాడ

నకు:
అందరు ఉప విద్యా శాఖాధికారులు
అందరు మండల విద్యా శాఖాధికారులకు
//అనుమతితో//
పర్యవేక్షకులు . 

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND