Sukanya Samriddhi Yojana Scheme
Sukanya Samriddhi Yojana Scheme - ఏ తల్లిదండ్రులకైనా కూతురు భవిష్యత్తుపై కాస్త ఆందోళన ఉంటుంది. చదువు, కెరీర్, పెళ్లి... ఇలా అన్నింటికీ డబ్బు కావాలి. ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బు సమకూర్చుకోవడం అంత సులువైన విషయం కాదు. అందుకే ఇప్పట్నుంచే కొద్దికొద్దిగా పొదుపు చేస్తూ ఉంటే మీ అమ్మాయి పైచదువులకు లేదా పెళ్లి నాటికి కావాల్సిన డబ్బు సమకూరుతుంది. ఆ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకమే సుకన్య సమృద్ధి యోజన. ఆ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
1. నరేంద్ర మోదీ ప్రభుత్వం బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా సుకన్య సమృద్ధి
యోజన పథకాన్ని ప్రారంభించింది
2. ఎవరైనా తమ కూతురు పేరు మీద ఈ అకౌంట్ తీసుకోవచ్చు. ఒకరు గరిష్టంగా ఇద్దరు కూతుళ్లకు అకౌంట్ తీసుకోవచ్చు.
3. మీ అమ్మాయి వయస్సు పదేళ్ల లోపు ఉంటే చాలు మీరు సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవచ్చు.
4. దేశంలోని అన్ని పోస్ట్ ఆఫీసుల్లో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరవచ్చు. బ్యాంకులు కూడా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి
5. సుకన్య సమృద్ధి యోజన పథకంలో నెలకు కనీసం రూ.250 జమ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.1,50,000 వరకు పొదుపు చేయొచ్చు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి
6. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ప్రారంభించిన నాటి నుంచి 15 ఏళ్ల వరకు డిపాజిట్లు చేయొచ్చు. ఉదాహరణకు మీరు రోజూ రూ.100 చొప్పున 15 ఏళ్లు పొదుపు చేస్తే మీ అమ్మాయికి 21 ఏళ్లు వచ్చేనాటికి సుమారు రూ.16 లక్షల రిటర్న్స్ పొందొచ్చు.
7. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌లో మీరు నెలనెలా క్రమం తప్పకుండా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆలస్య రుసుము రూ.50 చెల్లించాలి
8. సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రారంభించినప్పుడు 9.1 శాతం వడ్డీ ఉండేది. ప్రస్తుతం 8.5 శాతం వడ్డీ ఇస్తోంది ప్రభుత్వం. ప్రతీ మూడు నెలలకోసారి వడ్డీ రేట్లు మారుతుంటాయి.
9. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌లో మీ అమ్మాయి పేరు మీద డబ్బులు డిపాజిట్ చేస్తే మీకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు.
10. మీకు అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి మీ అమ్మాయి వయస్సు 21 ఏళ్లు వచ్చే వరకు ఈ స్కీమ్ ఉంటుంది. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత పెళ్లి లేదా ఉన్నత చదువుల కోసం అప్పటి వరకు జమైన మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా మీ అమ్మాయి వయస్సు 21 ఏళ్లు రాగానే మీరు డిపాజిట్ చేసిన మొత్తం వడ్డీతో సహా వస్తుంది.
11. సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి దగ్గర్లోని బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్‌లో వివరాలు తెలుసుకోవచ్చు. www.nsiindia.gov.in వెబ్‌సైట్‌లోనూ వివరాలుంటాయి
- ఒక అమ్మాయికి ఒకే ఖాతా తెరవాలి. తల్లిదండ్రులు గరిష్ఠంగా ఇద్దరు అమ్మాయిలకు కోసం ఈ ఖాతా తెరవ వచ్చు. కవలల విషయంలో ఈ సౌకర్యం మూడవ అమ్మాయికి కూడా ఈ ఖాతా తెరవ వచ్చు.
- ఈ ఖాతా కోసం కనీస డిపాజిట్ మొత్తాన్ని రూ.1000/- మరియు గరిష్ఠం సంవత్సరానికి రూ.1,50,000 వరుకు డిపాజిట్ చేయావచ్చు.
- ఈ ఖాతాలో డబ్బును 14 సంవత్సరాలు ఉంచ వలసి వుంటుంది.
- ఈ ఖాతా కోసం సంవత్సరానికి ఉన్న డబ్బుని, సంవత్సరానికి వడ్డీ రేటు 9.1%.వార్షికమును బట్టి మారును
- సుకన్య సంవృద్ది ఖాతాకి పాస్ బుక్ సౌకర్యం ఉంది.
- ఈ ఖాతాలో జమ చేసిన మొత్తానికి అదాయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద గరిష్ఠంగా రూ.1,50,000/- వరకు పన్ను మినహాయింపు ఉంది.
సుకన్య సంవృద్ది ఖాతాని తెరావడానికి కావలసిన పత్రాలు
- బాలిక బర్త్ సర్టిఫికేట్
- తల్లిదండ్రుల చిరునామా రుజువు
- తల్లిదండ్రుల గుర్తింపు రుజువు
- తల్లిదండ్రుల aadhar card
- తల్లిదండ్రుల ration card
No comments:
Post a Comment