2004 జనవరి 1 నుండి కేంద్ర ప్రభుత్వ శాఖలో చేరిన ఉద్యోగులకు 'జాతీయ పెన్షన్ పథకం (NPS) అమలులోకి వచ్చింది. మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2004 సెప్టెంబరు 1 నుండి జాతీయ పెన్షన్ విధానము 'కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్' (సిపిఎస్) పేరుతో అమలులోకి వచ్చింది.
జిఓ ఎంఎస్ నం. 653; తేది. 22.09.2004 ప్రకారం 2004 సెప్టెంబర్ 1 నుండి సర్వీస్లో చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, విశ్వ విద్యాలయ ఉద్యోగులు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందుతున్న సంస్థలలోని ఉద్యోగులు, అటానమస్ కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులు అందరికి ఈ పథకాన్ని వర్తింపజేశారు.
చందా : ఉద్యోగి తన బేసిక్ పే, డిఏలలో 10% సిపిఎస్ చందాగా ప్రతినెలా చెల్లించాలి, మ్యాచింగ్ గ్రాంట్ గా అంతే మొత్తమును రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగి ఖాతాకు జమ చేస్తుంది.
ప్రాన్ నంబరు పొందడం : ప్రాన్ నంబరు పొందుటకు నూతన ఉద్యోగులు 'సిఎస్ఆర్ఎఫ్ ఫారమ్ ఎస్-1'లో తమ దరఖాస్తులను మూడు కాపీలు తమ డ్రాయింగ్ అధికారులకు అందజేయాలి. దరఖాస్తులోని 5 సెక్షన్లలోని వివరాలను విధిగా పూర్తి చేయాలి. అయితే సెక్షన్ 'డి'లో పేర్కొన్న మూడు పథకాల్లో ఒక దానిని ఎంచుకోవడం తప్పనిసరికాదు. డ్రాయింగ్ అధికారులు 'ఫారమ్ ఎస్ 5'లో తమ కార్యాలయంలోని నూతన ఉద్యోగుల వివరాలు పూర్తిచేసి ఉద్యోగి దరఖాస్తుల ను జతపరచి, రెండు సెట్ల కవరింగ్ లెటర్తో సంబంధిత ట్రెజరీ అధికారి వారి
ద్వారా 'సెంట్రల్ రికార్డు కీపింగ్ ఏజెన్సీ, ఎస్ఎస్ఈఎల్, ముంబాయి వారికి గాని లేదా హైదరాబాదు మరియు విశాఖపట్నంలలో గల 'కార్వే కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థకు పంపాలి.
ఉపసంహరణ : ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నూతన పెన్షన్ పథకము క్రింద తమ ఖాతాలోని జమలను మూడు సందర్భంలలో విత్ డ్రాయల్ చేసుకొనుటకు అవకాశమున్నది.
ఎ) ఉద్యోగి పదవీ విరమణ సందర్భంలో : ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు నెలసరి పెన్షన్ పొందుటకు కనీసము 40% పెన్షన్ఫం డ్ జమలు యాన్యుటి బాండ్స్, కొనుగోలుకు వినియోగించవలసి వుంటుంది. ఇందుకు పిఎస్ఆర్డీఏ నిర్దేశించిన 7 సంస్థలలో ఒక దానిని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. అవి (ఎ) లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (బి) ఎస్బీఐ లైఫ్ (సి) ఐసిటిసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ (డి) హెడిఎఫ్ సి లైఫ్ ఇన్స్యూరెన్స్ (ఇ) బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ (ఎఫ్) రిలయన్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ (జి) స్టార్ యూనియన్ డామ్ ఇచి లైఫ్ ఇన్స్యూరెన్స్ సంస్థలు. మిగిలిన 60% జమలు పూర్తి మొత్తముగా చెల్లిస్తారు. లేదా చందాదారుడు ఎంపిక చేసుకున్న వివిధ చెల్లింపు పథకాల ద్వారా చెల్లిస్తారు. ఇందుకై పదవీ విరమణ పొందే ఉద్యోగులు Form 101- GS మరియు Form 101-GS-N లేదా Form 101-GS-NIలో దరఖాస్తు చేయాలి.
బి) ఉద్యోగి మరణించిన సందర్భంలో : ఉద్యోగి సర్వీసులో ఉండగ మరణించిన సందర్భంలో అతని వారసులకు 100% ఎక్యుములేటెడ్పె న్షన్ మొత్తమును చెల్లిస్తారు. ఇందుకై ఉద్యోగి వారసులు Form 103. GDలో దరఖాస్తు చేయాలి..
సి) పదవీ విరమణకు ముందే పథకము నుండి నిష్క్రమించు సందర్భంలో :
1. ఉద్యోగి తన పదవీ విరమణకు ముందే పథకం నుండి
నిష్క్రమించదలచిన పెన్షన్ ఫండ్ జమలులో కనీసం 80% యాన్యుటి బాండ్స్ కొనుగోలుకు వినియోగించవలసి వుంటుంది.మిగిలిన 20% జమలు పూర్తి మొత్తము చెల్లిస్తారు. లేదా చందాదారుడు ఎంపిక చేసుకున్న వివిధ చెల్లింపు పథకాల ద్వారా చెల్లిస్తారు. ఇందుకై Form 102-GP మరియు Form 102-GP-N లేదా Form 401-AN ఫారములు వినియోగించాలి.
2. పదవీ విరమణ అనంతరం చెల్లించదగు మొత్తములో 40% గాని లేదా పదవీ విరమణకు ముందు నిష్క్రమించుటకు చెల్లించుదగు 20%గా, జమలు 70 సం||లు వయస్సు వచ్చు వరకు పెన్షన్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టుటకు చందా దారులకు అవకాశం ఉంది. 70 సం||ల వయస్సు నిండిన వెంటనే చందాదారుని బ్యాంకు ఖాతాకు జమలు మొత్తము చెల్లించబడతాయి.
3. చందాదారుని పదవీ విరమణ తేదీ నాటికి అతని ఖాతాలో రెండు లక్షలు లేదా అంతకంటే తక్కువ మొత్తము నిల్వ ఉన్నట్లయితే సదరు మొత్తమును నగదుగా చెల్లిస్తారు. ఇందుకై ఫారమ్ 101-జిఎసన్ను పూర్తి చేసి, ప్రత్యేక వినతి పత్రము జతపరచి పంపాలి.
గ్రాట్యుటీ : సిపిఎస్ ఉద్యోగులకు డెత్-కం-రిటైర్మెంట్ గ్రాట్యుటీ అమలు చేస్తూ జిఓ ఎంఎస్ నం. 107 ఆర్థిక, తేది. 29.06.2017న విడుదల చేయడం జరిగింది.
ఫ్యామిలీ పెన్షన్ : సీపీఎస్ ఉద్యోగులకు కుటుంబ పింఛను మంజూరు చేస్తూ జిఓ ఎంఎస్ నం. 121 ఆర్థిక, తేది. 18.07.2017 విడుదలచేయటం జరిగింది. అయితే ఫ్యామిలీ పెన్షన్ కావాలనుకునేవారు వారి సిపిఎస్ ఖాతాలో నిల్వ ఉన్న మొత్తాన్ని ప్రభుత్వ పద్దులకు జమ
చేయవలసింది ఉంటుంది. ఫ్యామిలీ పెన్షన్ అవసరం లేనివారు సిపిఎస్ ఖాతాలో నిల్వ ఉన్న మొత్తాన్ని పొందవచ్చు.
పాక్షిక ఉపసంహరణ: సిపిఎస్ ఫండ్ నుండి పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తూ సర్క్యులర్ నం. పిఎస్ఆర్డీఏ/2018/40/ఎగ్జిట్; తేది. 10.01.2018 విడుదల చేయడం జరిగింది. కనీసం 3 సం||ల చందారుడైన ఉద్యోగి పాక్షిక ఉపసంహరణకు అర్హుడు. చందాదారుడు చెల్లించిన మొత్తంలో మాత్రమే 25% మించని విధంగా 3సార్లు మాత్రమే అనుమతిస్తారు. పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి, పిల్లల వివాహం కొరకు, నివాస గృహం లేదా ప్లాటు కొనుగోలు లేదా నిర్మాణం కొరకు, స్వంత, భాగస్వామి, పిల్లలు, ఆధారిత తల్లిదండ్రులకు కొన్ని
వ్యాధులకు వైద్య చికిత్స నిమిత్తం అనుమతిస్తారు.
No comments:
Post a Comment