సచివాలయాలకో ప్రత్యేక శాఖ--సెర్ప్, మెప్మా సహా నాలుగు శాఖల విలీనం
➧ క్షేత్ర స్థాయిలో కొత్తగా ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ కోసం ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఇటీవలే ఒక విభాగాన్ని ఏర్పాటుచేయగా, తాజాగా దానిని పూర్తిస్థాయి శాఖగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
➧ఇతర శాఖల మాదిరిగానే కొత్త శాఖకు కూడా రాష్ట్ర సచివాలయంలో కార్యదర్శి, ఇతర సిబ్బందితో పాటు ప్రత్యేకంగా శాఖాధిపతి కార్యాలయం కూడా ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.
➧ఈ కొత్త శాఖలోకి ప్రస్తుతం ఉన్న పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టి ఇన్ మున్సిపాలిటీస్ (మెప్మా, ఇఎడి (మీ సేవలో), రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎస్ఎఆర్ డి)లను తీసుకురావాలని ప్రతిపాదించారు.
➧సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను ఏర్పాటుచేసిన అనంతరం వాటిలో కొత్తగా 85 పోస్టులను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. కార్యదర్శి స్థాయిలో ఐఏఎస్ ను నియమించాలని, మరో ఐదు కింద స్థాయి పోస్టులను కూడా కేటాయించాలని నిర్ణయించారు.
➧అలాగే శాఖాధిపతిగా ఐఏఎస్ ను, ఇతర పోస్టుల్లో మరో 79 మందిని నియమించాలని నిర్ణయించారు.
➧గత ఏడాది 11,158 గ్రామ సచివాలయాలు, 3, 842 వార్డు సచివాలయాల్లో 1.18 లక్షల మందిని శాశ్వత ప్రాతిపదికన నియమించిన సంగతి తెలిసిందే.
➧వీరికి అదనంగా 1.95 లక్షల మంది గ్రామ వాలంటీర్లు 71 వేల మంది వార్డు వాలంటీర్లను కూడా నియమించారు. ఇంత భారీగా ఉద్యోగులు ఉండడంతో వీరి కోసం కొత్త శాఖను ఏర్పాటుచేయడమే మేలని ప్రభుత్వం భావిస్తోంది.

No comments:
Post a Comment