ప్రీ ప్రైమరీ విద్య'పై డాక్యుమెంటరీ
పర్యవేక్షించిన కమిషనరు వీరభద్రుడు
పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్య బోధనా పద్ధతులపై పాఠశాల విద్యాశాఖ డాక్యుమెంటరీ చిత్రీకరణ ప్రారంభించింది. పాఠశాల విద్యాశాఖ కమిషనరు వి.చినవీరభద్రుడు పర్యవేక్షణలో కృష్ణా జిల్లా కంకిపాడు ప్రాథమిక పాఠశాల ఆవరణలో సోమవారం ఈ చిత్రీకరణ జరిగింది. ఈ సందర్భంగా కమిషనరు మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక విద్యలో భాగంగా అంగన్వాడీ టీచర్లు వర్కర్లు, చిన్నారులకు మాతృభాష తోపాటు ఆంగ్లాన్ని సులభంగా బోధించే పద్ధతులు ఈ డాక్యుమెంటరీలో ఉంటాయని అన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ సమూల మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం వినూత్న ఆలోచనలతో నిరంతర కృషి చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పూర్వ ప్రాథమిక విద్యను ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి
తెచ్చేందుకు సన్నద్ధమవుతోందని తెలిపారు.

No comments:
Post a Comment