పాఠశాలల్లో ఇక పారిశుద్ధ్య కార్మికులు ఉండరు
పరిశుభ్రత బాధ్యత పంచాయతీలదే
ఏటా పాఠశాలలకు తాత్కాలిక ప్రాతిపదికన కేటాయిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఇక ఉండరు. పాఠశాలల పరిశుభ్రత బాధ్యతను ప్రభుత్వం స్థానిక సంస్థలకు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం అన్ని పాఠశాలల మరుగుదొడ్లు శుభ్రత, పరిసరాల పరిశుభ్రత బాధ్యత గ్రామ పంచాయతీలదేనని పేర్కొంది. ఈ విషయమై గ్రామ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారులు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ పీవీ శ్రీహరి కోరారు. గత మూడేళ్ల నుంచి అన్ని పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వం కేటాయిస్తోంది. వారికి ఒక్కొక్కరికి రూ.2500 వేతనం ఇచ్చేవారు

No comments:
Post a Comment