Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

మార్చి 2021 వరకు మారటోరియం కొనసాగింపు

మార్చి  2021 వరకు మారటోరియం కొనసాగింపు
➧నిన్నటితో లోన్ల మారటోరియం గడువు పూర్తయిన నేపథ్యంలో మరోసారి దీనిపై క్లారిటీ వచ్చేసింది.
➧మార్చి 2021 వరకు మారటోరియం కొనసాగించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. మారటోరియం కొనసాగుతుందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
➧మారటోరియం గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.
➧ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఎదుట హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఆయన.. ఇప్పటికే మారటోరియం కొనసాగింపుపై కసరత్తు ప్రారంభమైందని... మార్చి 2021 వరకు మారటోరియం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
➧అయితే మారటోరియం నేపథ్యంలో ఇప్పటికే చెల్లించని ఈఎంఐలపై ఎలాంటి అదనపు రుసుము విధించకూడదని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది.
➧ఈ విషయాన్నీ అన్ని బ్యాంకులు పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అనంతరం దీనిపై విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.
➧కాగా ఆగస్ట్‌ 31తో ముగిసిన మారటోరియం గడువును డిసెంబర్‌ 31 వరకు పొడించాలని కోరుతూ న్యాయవాది విశాల్‌ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
➧కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని మారిటోరియం గడువును ఈ ఏడాది చివరి వరకు పెంచేలా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్‌బీఐని, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను ఆదేశించాలని కోరారు. పిటిషన్‌ లో పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND