Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP INTERMEDIATE PUBLIC EXAMINATION - 2019 -SECOND YEAR STUDENTS MARKS SHEETS AVAILABLE

కోరిన వెంటనే ఇంటర్‌ మార్కులు
జ్ఞానభూమి పోర్టల్‌లో సిద్ధం
నేటి ఉదయం 10 నుంచే డౌన్‌లోడ్‌కు అవకాశం

 మంత్రి సూచనతో బోర్డు తక్షణ స్పందన
ఇతర రాష్ట్రాల విద్యా సంస్థల్లో అడ్మిషన్లు సులభం

 రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ మార్కులకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రేడింగ్‌ విధానం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల్లో చేరేందుకు మార్కుల విధానమే అమల్లో ఉండడంతో మన రాష్ట్ర విద్యార్థులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు. దీనిపై వచ్చిన ఫిర్యాదులు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులకు కోరిన వెంటనే మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది. రెండేళ్ల ఇంటర్‌ పూర్తయిన సుమారు 5 లక్షల మంది సెకండియర్‌ విద్యార్థుల మార్కులనుjnanabumi.ap.gov.in పోర్టల్‌లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు ప్రారంభించింది. విద్యార్థులు తమ మార్కులను ఆదివారం(నేడు) ఉదయం 10 గంటల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఇంటర్‌ బోర్డు సెక్రెటరీ కాంతిలాల్‌ దండే శనివారం ఒక ప్రకటనలో సూచించారు. ఇప్పటి వరకు గ్రేడింగ్‌ రూపంలో ఇస్తున్న ఇంటర్‌ ఫలితాలు/మెమోల వల్ల ఇతర రాష్ట్రాల్లోని ఉన్నత విద్యా సంస్థలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోరుకునే ఏపీ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రేడింగ్‌ను పరిగణనలోనికి తీసుకోబోమని ఇతర రాష్ట్రాల విద్యాసంస్థలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో మార్కులతో కూడిన మెమోల కోసం నిత్యం వేలాది మంది ఇంటర్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విజయవాడలోని ఇంటర్‌బోర్డు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఏపీలోని ఉన్నత విద్యా సంస్థలు/వర్సిటీల్లో అయితే ఇంటర్‌బోర్డు జారీ చేసిన గ్రేడింగ్‌ మెమోల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తున్నారు. కానీ, ఇతర రాష్ట్రాల్లో మార్కుల మెరిట్‌ను బట్టి అడ్మిషన్లు ఇస్తున్నారు. ఫలితంగా కీలకమైన అడ్మిషన్ల విషయంలో మన విద్యార్థులు నష్ట పోతున్నారు.

ఢిల్లీ వర్సిటీ సూచనతో.
ఇంటర్‌ గ్రేడింగ్‌ విధానం వల్ల ఏపీ విద్యార్థులకు ఢిల్లీ యూనివర్సిటీ అడ్మిషన్లలో నష్టం జరుగుతోందని, విద్యార్థులకు నేరుగా మార్కుల మెమో ఇస్తే వాటి ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని ఆ వర్సిటీ వీసీ ఈ-మెయిల్‌ పంపారు. ఈ మెయిల్‌పై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తక్షణమే స్పందించారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శికి సూచించారు. ఈ నేపథ్యంలో.. ఇంటర్‌ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సంబంధించిన మార్కులను తక్షణమే అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు.

‘గ్రేడ్‌’పై ఢిల్లీలో ఏపీ విద్యార్థుల ఆందోళన

 ఏపీ ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో ఇచ్చిన క్యుములేటివ్‌ గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌(సీజీపీఏ)ను 9.5గా గుణిస్తామని ఢిల్లీ యూనివర్సిటీ ప్రకటించడంపై రాష్ట్ర విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సీజీపీఏ గ్రేడ్‌ను 10తో గుణించాలని డిమాండ్‌ చేశారు. 9.5తో గుణిస్తే ప్రవేశాలు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 500 మంది విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన వివిధ కాలేజీల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరేందుకు ఢిల్లీకి వచ్చారు. అయితే, గ్రేడ్‌ విషయంలో ఢిల్లీ వర్సిటీ ప్రకటన వీరిని ఆందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ భవన్‌ అధికారులను ఆశ్రయించగా, రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ కేంద్ర ఉన్నత విద్య విభాగం కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. సీజీపీఏ గ్రేడ్‌ను 10తో గుణించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారంతో ప్రవేశాలు ముగియనున్నాయి.




➪Select Month -Year
➪Enter Your hall ticket number
➪Enter Aadhar Number
➪Then Click Get Data

Click below Link↴

Download Marks Sheet here 

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND