దేశవ్యాప్తంగా మే 27న అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించగా, 1,61,319 మంది పరీక్ష రాశారు. వీరిలో 38,705 మంది అర్హత సాధించారు. అర్హత సాధించిన వారిలో 33349 మంది అబ్బాయిలు కాగా, 5356 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరిలో జనరల్ విద్యార్ధులు 15,566 మందికాగా, జనరల్ ఈడబ్యూఎస్ అభ్యర్ధులు 3636 మంది ఉన్నారు. ఓబిసి విద్యార్ధులు 7651 మంది, ఎస్సీ అభ్యర్ధులు 8758 మంది, ఎస్టీ అభ్యర్ధులు 3094 మంది అర్హత సాధించిన వారిలో ఉన్నారు. తెలంగాణ నుంచి 16,886 మంది, ఏపీ నుంచి 13,267 మంది చొప్పున 30,153 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్ రాతపరీక్షలకు హాజరయ్యారు.
జూన్ 16 నుంచి సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
➧Enter your Advanced Register Number
➧Enter your Date of Birth
➧Enter Security pin
Then Click submit
Click here to Get Results