Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఏప్ బడ్జెట్ - 2019 లో దేనికెంత కేటాయించారంటే..

ఏప్ బడ్జెట్ లో దేనికెంత కేటాయించారంటే..

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మొత్తం రూ.2లక్షల 27 వేల 974 కోట్లతో బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాగా బుగ్గన తొలిసారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా.. మొదట ఏపీ ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బడ్జెట్‌ ప్రసంగాన్ని మంత్రి ప్రారంభించారు.



బడ్జెట్‌లో కేటాయింపులు ఇవీ...

మొత్తం బడ్జెట్ : రూ.2లక్షల 27 వేల 974 కోట్లు

రెవెన్యూ లోటు-రూ.1,778.52 కోట్లు

బడ్జెట్ అంచనా-19.32శాతం పెరుగుదల

రెవెన్యూ వ్యయం-20.10శాతం పెరుగుతందని అంచనా

కేటాయింపుల్లో దేనికెంత..!?

రాజధాని అమరావతికి రూ.500 కోట్లు

విద్యుత్‌ కొనుగోళ్లు ఒప్పందం కోసం అదనంగా రూ.2 వేల కోట్లు చెల్లిస్తోంది

ఇంధన రంగంలో గత ప్రభుత్వం నుంచి రూ.20 వేల కోట్లు రుణంగా వచ్చింది

సాగునీటి శాఖకు 13,139 కోట్లు

వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు 8750 కోట్లు

అగ్రిగోల్డ్‌ బాధితులకు 1150 కోట్లు

ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమానికి రూ.400 కోట్లు

వైఎస్‌ఆర్‌ 9గంటల ఉచిత విద్యుత్‌కు 4525 కోట్లు

ధరల స్థిరీకరణ నిధికి రూ.3వేల కోట్లు

విపత్తుల నిర్వహణకు రూ.2,002 కోట్లు

ఫసల్‌ బీయా యోజనకు రూ.1163 కోట్లు

ఆక్వా రైతుల విద్యుత్‌ సబ్సిడీ రూ.475 కోట్లు

వైఎస్‌ బోర్‌ వెల్‌పథకానికి రూ.200 కోట్లు

విత్తనాల సరఫరాకు రూ.200 కోట్లు

అమ్మ ఒడి పథకానికి రూ.6455 కోట్లు

స్కూళ్లలో మౌలికవసతులకు రూ.1500 కోట్లు

మధ్యాహ్న భోజనానికి రూ.1077 కోట్లు

వైఎస్‌ఆర్‌ స్కూల్‌ మెయింటనెన్స్‌ గ్రాంట్‌ రూ.160 కోట్లు

ఆరోగ్యశ్రీ రూ.1740 కోట్లు

ఆస్పత్రుల్లో మౌలికవసతులకు రూ.1500 కోట్లు

ఆశావర్కర్ల గౌరవవేతనం 456 కోట్లు

వైఎస్‌ఆర్‌ ట్రైబల్‌ మెడికల్‌ కాలేజి- రూ.66 కోట్లు

గురజాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజి -66 కోట్లు

విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజి -66 కోట్లు

శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పతికి 50 కోట్లు

వైఎస్‌ఆర్‌ గృహ వసతికి రూ 5వేల కోట్లు

పట్టణాల్లో ప్రధాని ఆవాస్‌ యోజనకు రూ.1370 కోట్లు

బలహీనవర్గాల ఇళ్లకు రూ.1280 కోట్లు

వైఎస్‌ఆర్‌ అర్భన్‌ హౌసింగ్‌కు వెయ్యి కోట్లు

వైఎస్సార్‌ కళ్యాణ కానుకకు రూ.300 కోట్లు

కాపు కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు

వైఎస్సార్‌ బీమాకు రూ. 404 కోట్లు

బియ్యంపై సబ్సిడీకి రూ.3 వేల కోట్లు

గ్రామ వాలంటీర్లకు రూ.720 కోట్లు

మున్సిపల్‌ వార్డు వాలంటీర్లకు రూ.280 కోట్లు

మున్సిపల్‌ వార్డు సెక్రటేరియట్‌కు రూ.180 కోట్లు

ఏపీఐఐసీకి రూ.360 కోట్లు

కడప స్టీల్‌ప్లాంట్‌కు రూ.250 కోట్లు

పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.573 కోట్లు

చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి రూ.200 కోట్లు

చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి రూ.200 కోట్లు

ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి కింద రూ.500 కోట్లు

ఉపాధిహామీ పథకానికి రూ.500 కోట్లు

పంచాయతీరాజ్‌ రోడ్లకు రూ.300 కోట్లు

విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి రూ. 200 కోట్లు

ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు

ఆర్టీసీ ద్వారా ఇస్తోన్న రాయితీలకు రూ.500 కోట్లు

డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు రూ.1,140 కోట్లు

పట్టణాల్లో స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాలు రూ.648 కోట్లు

ఇరిగేషన్‌, వరద ముంపు నివారణకు రూ.13,139 కోట్లు

వ్యవసాయానికి రూ.20,677 కోట్లు

గ్రామీణాభివృద్ధికి రూ.29,329 కోట్లు

విద్యుత్‌- రూ.6,861 కోట్లు, రవాణా- రూ.6,157 కోట్లు

ఇండస్ట్రీ మినరల్స్‌కు రూ.3,986 కోట్లు

జనరల్‌ ఎకో సర్వీసెస్‌ రూ.6,025 కోట్లు

సాధారణ విద్య- రూ. 32,618 కోట్లు

క్రీడలు, యువజన సర్వీసులకు రూ.329 కోట్లు

సాంకేతిక విద్య- రూ. 580 కోట్లు, సాంస్కతికశాఖకు రూ. 77 కోట్లు

వైద్యరంగానికి రూ. 11,399 కోట్లు

నీటి సరఫరా, పారిశుద్ధ్యానికి రూ.2,234 కోట్లు

గృహనిర్మాణశాఖకు రూ.3,617 కోట్లు

అర్బన్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 6,587 కోట్లు

సమాచార, పౌరసంబంధాలశాఖకు రూ. 191 కోట్లు

సంక్షేమశాఖలకు రూ.14,142 కోట్లు

కార్మిక, ఉపాధిశాఖలకు రూ.978 కోట్లు

సామాజిక భద్రత, సంక్షేమానికి రూ.2, 707 కోట్లు

సాధారణ సర్వీసులకు రూ.66,324 కోట్లు

వ్యవసాయ మార్కెటింగ్, సహకారశాఖలకు రూ.18,327 కోట్లు

పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్‌, మత్య్సశాఖలకు రూ.1,912 కోట్లు

బీసీ సంక్షేమానికి రూ.7,271 కోట్లు

పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక రంగాలకు రూ.446 కోట్లు

ఉన్నత విద్యకు రూ.3,021 కోట్లు

హోంశాఖ రూ. 7,461.92 కోట్లు

మైనార్టీ సంక్షేమానికి రూ. 952 కోట్లు



ఎస్టీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.4,988 కోట్లు

ఎస్సీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ. 15 వేల కోట్లు

బీసీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ. 15,061 కోట్లు

నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు రూ.300 కోట్లు

Download AP Budget - 2019 telugu Copy 

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND