మూడింటికీ ఒకే పరీక్ష.. నెక్ట్స్
మెడికల్ పీజీలో ప్రవేశాలకు..
వైద్యుల ప్రాక్టీసు అనుమతికి
విదేశాల్లో పట్టభద్రులైన వారికి..
జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర
జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమోదం పొందితే 1956 నాటి చట్టం స్థానంలో అమలులోకి వస్తుంది. భారత వైద్య మండలి స్థానంలో ఎన్‌ఎంసీ ఏర్పాటు అవుతుంది. ఈ బిల్లులో ప్రతిపాదన ప్రకారం.. ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరంలో ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు.
దీనిని నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్)గా వ్యవహరిస్తారు. పోస్టు-గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు, ప్రాక్టీసు కోసం లైసెన్సు జారీకి నెక్ట్స్ ఫలితాలనే ప్రాతిపదికగా తీసుకుంటారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి వచ్చిన వారికి స్ర్కీనింగ్ టెస్ట్ కూడా ఇదే అవుతుంది! ఎయిమ్స్ వంటి సంస్థలకు కూడా నెక్ట్స్ వర్తిస్తుంది. ఇందులో 4 స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బోర్డులుంటాయి. అవి- 1) అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు, 2) పోస్టు-గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు, 3) మెడికల్ అసె్‌సమెంట్, రేటింగ్ బోర్డు (ఎంఏఆర్‌బీ), 4) ఎథికల్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు. వైద్య కళాశాలలను అంచనా వేయడానికి, వాటికి ర్యాంకింగ్ వ్యవస్థను రూపొందించడం ఎంఏఆర్‌బీ బాధ్యత.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) చట్ట సవరణ బిల్లును కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీని ద్వారా అమరావతి, భోపాల్, జోర్హాత్, కురుక్షేత్రల్లో కొత్త ఎన్‌ఐడీలకు జాతీయ ప్రాధాన్య సంస్థల హోదా దక్కుతుంది.
58 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసేందుకు మరో బిల్లుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రెండు టర్మ్‌లలో కలిపి ఎన్‌డీఏ ప్రభుత్వం 1824 పాత చట్టాలను రద్దు చేసింది. మూడు ప్రభుత్వ రంగ ఔషధ సంస్థలకు పెద్ద ఉపశమనం లభించింది. వాటికి రూ.330.35 కోట్ల రుణం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఆ సంస్థల్లోని ఉద్యోగులకు జీతాల బకాయిలు చెల్లిస్తారు. కాగా, డ్యాం పరిరక్షణ బిల్లునూ ఆమోదించారు.

No comments:
Post a Comment