Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

STMS - స్కూల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం

 స్కూల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం

       Download STMS app 

▪ ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? మరో నాలుగేళ్ల తర్వాత ఎలా ఉండబోతున్నాయి? అన్న విషయాన్ని సచిత్రంగా ప్రజల ముందు ఉంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం.

▪ పాఠశాలల ప్రస్తుత వాస్తవ పరిస్థితులను ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేసేందుకు మొబైల్‌ బేస్డ్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

▪ దాని నియమ నిబంధనలు తెలుపుతూ ఈ నెల 28వ తేదీలోగా  ప్రక్రియను పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శనివారం డీఈవోలకు ఉత్తర్వులు జారీ.

▪ యాప్‌ వినియోగాన్ని రెండు విభాగాలుగా విభజించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సంబంధిత ప్రధానోపాధ్యాయులే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.

▪ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఎంఈవోలు బాధ్యులుగా ఉంటారు. ఇందుకు సంబంధించి సీఆర్పీలు, హెచ్‌ఎంలు, ఎంఈవోలకు ఈ నెల 15, 16 తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.

▪ 17 నుంచి 27 వరకూ ఫొటోలు అప్‌లోడ్‌, 18 నుంచి 28 వరకూ అప్‌లోడ్‌ చేసిన ఫొటోలను మరోసారి పరీక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

▪ సీఆర్పీలు, ఉపాధ్యాయులు తమ చరవాణుల్లో stms.ap.gov.in (స్కూల్‌ ట్రాన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) యాప్‌లోకి ప్రవేశించగానే డౌన్‌లోడ్‌ బటన్‌ అందుబాటులోకి వస్తుంది.

▪ డౌన్‌లోడ్‌ పూర్తయిన తర్వాత ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. యాప్‌ తెరిచిన తర్వాత పాఠశాల యూ డైస్‌ నంబరు, లాగిన్‌ ఐడీ నంబరు నొక్కితే... వెంటనే ఆయా పాఠశాలల వివరాలు ప్రత్యక్షమవుతాయి.

▪ యాప్‌ను చేతితో పట్టుకుని పాఠశాల ప్రాంగణం చుట్టూ తిరుగుతూ ప్రహరీలు, భవనాలు, పాఠశాల అదనపు తరగతి గదులు, ఫ్యాన్లు, లైట్లు, వైరింగ్‌, స్విచ్‌బోర్డులు, అసలు విద్యుత్తు సౌకర్యం ఉన్నదీ లేనిది, మరుగుదొడ్లు, నీటి వసతి, ఫర్నిచర్‌, బ్లాక్‌ బోర్డులు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, ఆట స్థలాలు, ఎంత మంది పిల్లలు ఉన్నారనే అంశాలను ఫొటోలు తీసి... వాటికి కేటాయించిన విభాగాల్లో అప్‌లోడ్‌ చేసి సబ్‌మిట్‌ బటన్‌ నొక్కాలి.

▪ మూడు నుంచి అయిదో తరగతి వరకు, ఆరు నుంచి 8వ తరగతి వరకు, 9 నుంచి 12వ తరగతి వరకూ ఎంత మంది ఉన్నరన్నదీ అప్‌లోడ్‌ చేయాలి.

▪ ఒకసారి సబ్‌మిట్‌ నొక్కిన తర్వాత మళ్లీ అడుగుతుంది. అకుపచ్చ బటన్‌ నొక్కితే సేవ్‌ అవుతాయి. ఎర్రబటన్‌ నొక్కితే తిరిగి మెనూలోకి వెళ్లవచ్ఛు
APP యొక్క Preface క్రింది విదంగా వుంటుంది .


➥Visit webpage : www.stms.ap.gov.in

క్రింద వున్న డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేసి STMS App ను డౌన్లోడ్ చేసుకొని మీ స్కూల్ ఫొటోస్ అప్లోడ్ చేయండి .

  download   STMS APP 

Download STMS APK here 

DEO EGDT -- STMS app ద్వారా మీ మండలములలోని అన్ని పాఠశాలల సమాచారమును ఈ క్రింది విధంగా ది.26.07.2019 న ఖచ్చితంగా పూర్తి చేయవలసియున్నది.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND