గ్రా మ, వార్డు సచివాలయ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు
11-08-2019 రాత్రి 11.59 వరకూ అభ్యర్థులకు అవకాశం
వరదల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
➧ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజు గడువు పొడిగించింది. తొలుత నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం శనివారం రాత్రి 11.59 గంటలతో దరఖాస్తు గడువు ముగియగా దాన్ని ఆదివారం రాత్రి 11.59 గంటల వరకూ పొడిగిస్తున్నట్లు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
➧ వరద పరిస్థితుల దృష్ట్యా గడువు పొడిగించాలని కోరుతూ అభ్యర్థుల నుంచి అందిన వినతులపై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
➧ కాగా శనివారం రాత్రి 8.30 గంటల సమయానికి మొత్తంగా 21,64,490 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. కేటగిరి-1కి 12,36,277, కేటగిరి-2 (ఏ)కి 1,34,371, కేటగిరి-2 (బి)కి 1,63,744, కేటగిరి-3కి 6,30,098 దరఖాస్తులొచ్చాయి.
➧ శనివారం ఒక్క రోజే 1,20,300 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా చూస్తే కేటగిరి-1 విభాగంలోని పోస్టులకు ఎక్కువ మంది పోటీపడుతున్నారు.
పరీక్షలను వాయిదా వేయాలి: నిరుద్యోగ ఐకాస
➧ గ్రామ సచివాలయాల్లో వివిధ పోస్టుల నియామక పరీక్షలను నెలరోజుల పాటు వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐకాస డిమాండ్ చేసింది. ఒకే వారంలో గ్రామ సచివాలయ పోస్టులకు, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు నిర్వహిస్తున్నారని శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది.
➧ గతంలో ఉద్యోగ నియామకాలు లేక వేలాది మంది అభ్యర్థుల వయోపరిమితి మించిందని, తాజా నోటిఫికేషన్‌లో అభ్యర్థుల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేసింది.
➽ Click Here to Online Apply

No comments:
Post a Comment