Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

విందాం - నేర్చుకుందాం-- రేడియో పాఠం--తేది : 09.09.2019-- విషయము : గణితము--తరగతి : 5వ తరగతి-- పాఠం పేరు : "పెద్ద సంఖ్యలు"--సమయం : 11-00 AM

"విందాం - నేర్చుకుందాం"
నేటి రేడియో పాఠం
 తేది : 09.09.2019
 విషయము : గణితము
 పాఠం పేరు : "పెద్ద సంఖ్యలు"
 తరగతి : 5వ తరగతి
 సమయం : 11-00 AM
నిర్వహణ సమయం : 30 ని.లు
పెద్ద సంఖ్యలు
బోధనా లక్ష్యాలు:
విద్యార్థినీ విద్యార్థులు :
అయిదంకెల సంఖ్యల వరకు సంఖ్యలను పోల్చడం
• ఇవ్వబడిన అంకెలచే వీలైనన్ని సంఖ్యలను తయారు చేయగలరు
• అయిదంకెల సంఖ్యల వరకు విస్తరించి రాయగలరు
• స్థానవిలువల ఆధారంగా పెద్ద/చిన్న సంఖ్యలను గుర్తించగలరు
• ఇవ్వబడిన సంఖ్యలను దగ్గరి వేలల్లోకి చెప్పగలరు
బోధనాభ్యసన సామగ్రి:
పాఠ్యపుస్తకం, స్థానవిలువల పట్టిక, సంఖ్యాకార్డులు.
• (0-9),(10, 20....90), (100,200....900), (1000,2000,.....9000) లు
ప్రతిది నాలుగు సెట్లు.
బోధనాభ్యసస కృత్యాలు :

కృత్యం :1
పిల్లలను ఇద్దరిద్దరు చొప్పున ఎదురెదురగా కూర్చునేట్లు జట్లు చేయండి.
•(0-9 వరకు గల సంఖ్యాకార్డులను ప్రతి జట్టుకు ఇవ్వండి.వాటిని ఇద్దరి మధ్యలో పెట్టుకోమనండి.
• ఇద్దరిలో ఒకరితో నాల్గంకెల సంఖ్యను చెప్పించండి. రెండవ విద్యార్థి మొదటివాడు చెప్పిన సంఖ్యను కార్డులతో పేర్చి
చూపించమనండి,

కృత్యం : 2
జట్లను అలాగే ఉండమని చెబుతూ వారిమధ్య ఉన్న కార్డులను బోర్లించమనండి.
• కార్డులను కలుపుతూ ఏవేని నాలుగు కార్డులు తీయమంటూ వాటిలో ఉండే అంకెలచే మిక్కిలి పెద్ద సంఖ్యను
చేయించండి.
కృత్యం : 3
విద్యార్థులను 4 గురు చొప్పున జట్లుగా చేయండి.
• వేలు, వందలు, పదులు మరియు ఒకట్లలో తయారుచేసిన కార్డులను ప్రతిజట్టుకు ఒక సెట్టు ఇవ్వండి.
• రేడియో టీచర్ చెప్పిన సంఖ్యను నల్లబల్లపై రాయండి
• సూచనల ప్రకారం అడిగిన అంకె యొక్క స్థానవిలువను వారి, మధ్య ఉన్న కార్డులనుపయోగించి చూపమనండి.

కృత్యం : 4
స్థానవిలువల పేటికను పిల్లలందరికీ కనిపించేట్లు పెట్టండి.
• దానిముందు ఒకట్లు, పదులు, వందలు, వేలల్లో రాయబడిన సంఖ్యాకార్డుల కట్టలను వేర్వేరుగా ఉంచండి.
• ఒక నాల్గంకెల సంఖ్యను నల్లబల్లపై రాయండి. ఒకరిచే చదివిస్తూ మరొకరిచే విస్తరణరూపంలో ఉన్న పట్టికలో నాలుగు
కట్టలనుండి సరియగు కార్డులను ఉంచమనండి.
*కార్యక్రమములో ప్రసారమయ్యే పాటను చార్డుపై స్పష్టంగా రాసి తరగతి గదిలో ప్రదర్శించాలి.
పాట (పాఠం పై గేయం):
పల్లవి :
ఒకట్లు, పదులూ, వందలు, వేలూ, పదివేలూ....
ఇవి సంఖ్యలలోనీ స్థానాలు...
ఇవి సంఖ్యలలోనీ స్థానాలు    ||ఒకట్లు||

చరణం 1:
అంకె యొక్క స్థానం మారితే విలువ మారుతుందీ.....
ఎడమకు పోతే పది రెట్లు... కుడివైపుకు పోతే పదోవంతుగా
విలువమారుతుంది....
ఒకట్ల స్థానంలో '9’ ఉంటే అది - తొమ్మిది అవుతుంది
అది పదుల స్థానంలోకి మారితే - తొంభై అవుతుంది
అదే వందల స్థానంలోకి మారితే - తొమ్మిది వందలవుతుందీ
వేల స్థానంలోకి తొమ్మిది చేరితే - తొమ్మిది వేలు అవుతుంది   ||ఒకట్లు||
పాట ప్రసార సమయంలో
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND