విద్యాశాఖలోనూ రివర్స్ టెండరింగ్
సచివాలయ’ ఉద్యోగ భర్తీలో లోపాలుంటే సరిదిద్దుతాం: మంత్రి సురేష్
మార్కాపురం గ్రామీణం - న్యూస్‌టుడే
విద్యాశాఖలోనూ రివర్స్ టెండరింగ్
విద్యాశాఖలోనూ అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయినందున ఆ శాఖలోని పనులకూ రివర్స్ టెండరింగ్‌కు వెళ్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయాలను అందుబాటులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిదేనని, గాంధీ జయంతి రోజున అందుబాటులోకి వచ్చే ఈ వ్యవస్థ వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు.గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో పొరపాట్లు, లోటుపాట్లు జరిగి ఉంటే వాటిని పూర్తిస్థాయిలో సరిదిద్దుతామన్నారు. ప్రత్యేక కమిటీని కానీ డెస్కును కానీ ఏర్పాటు చేసి లబ్ధిదారులకు న్యాయం చేస్తామన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని, వారు అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. జనవరిలో గణతంత్రదినం సందర్భంగా ‘అమ్మ ఒడి’ పథకాన్ని రూ.6,450 కోట్ల కేటాయింపులతో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

No comments:
Post a Comment