మొబైల్ వ్యాలేట్ల kyc పూర్తి కి గడువు ఆరు నెలల పెంపు
మొబైల్ వ్యాలెట్లు తమ వినియోగదారుడి గుర్తింపును నిర్ధారించుకొనే నో యువర్ కస్టమర్(ఈ-కేవైసీ) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలనే నిబంధన గడువు తేదీని భారతీయ రిజర్వు బ్యాంకు మరో ఆరు నెలలపాటు పొడిగించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 29 వరకూ పొడిగిస్తూ ఇకపై గడువు పెంచేది లేదని తేల్చి చెప్పింది.
పేటీఎం, ఫోన్ పే, అమెజాన్ పే వంటి మొబైల్ వ్యాలెట్ సంస్థలు ఈ ఏడాది ఆగస్టు నెలాఖరులోపు తమ వినియోగదారుల కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆర్బీఐ తొలుత గడువు విధించింది. ఇది పూర్తయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా యాప్ల ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చని సూచించింది. అయితే, ముందు నిర్దేశించిన 18 నెలల గడువులోపు కేవేసే ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇప్పుడు దాన్ని 24 నెలలకు ఆర్బీఐ పెంచింది.
కేవైసీ అంటే.. సదరు మొబైల్ వ్యాలెట్ సంస్థ ప్రతినిధి నేరుగా తమ వినియోగదారుడి వద్దకు వెళ్లి వారి వేలిముద్ర సహా, అన్ని పత్రాలు ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు వ్యాలెట్ సంస్థలు ఆన్ లైన్లోనే స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ ప్రక్రియను పాక్షికంగా నిర్వహించేవి. అయితే, ఈ విధానం కొంత శ్రమతో కూడుకున్న వ్యవహారం కావడంతో వినియోగదారుడితో ఫేస్ టు ఫేస్ ధ్రువీకరింపు అవసరం లేకుండా ప్రభుత్వం సరళతర విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భారతీయ చెల్లింపుల మండలి (పీసీఏ) గతంలోనే సూచించింది.
🔸ఈ నేపథ్యంలో ఆర్బీఐ విధించిన గడువులోపు వ్యాలెట్ సంస్థలు సమర్థంగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకొనేలా ఆధార్ సంఖ్య లేదా ఏదైనా డిజిటల్ పద్ధతిలో నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని పీసీఐ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది.

No comments:
Post a Comment