10లో పేపర్లవారీగా గ్రేడ్లు
మార్కుల జాబితాల్లో ప్రత్యేక మార్పు
పరీక్షల సంస్కరణలపై ఉత్తర్వులు
పదోతరగతి మార్కుల జాబితాలో (మెమో) ఇక నుంచీ పేపర్ల వారీగాను, సబ్జెక్టుల వారీగానూ గ్రేడ్లు ఇస్తారు. పదోతరగతిలో హిందీ మినహా మిగతా అన్ని సబ్జెక్టులకూ రెండేసి పేపర్లుంటాయి. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షల్లో తెచ్చే సంస్కరణలను ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ప్రకారం ఏదైనా ఒక పేపరులో ఉత్తీర్ణులు కానప్పుడు పేపర్లవారీగా ఇచ్చే గ్రేడ్ల అనుత్తీర్ణత గ్రేడ్ వచ్చినా.. సబ్జెక్టుతో కలిపినప్పుడు ఉత్తీర్ణత గ్రేడ్ ఇస్తారు. జాతీయ పాఠ్యాంశాల ప్రణాళిక-2005 సిఫార్సులు, నూతన విద్యా విధానం-2019, పరీక్షల్లో సంస్కరణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులు, పదోతరగతి పరీక్షల్లో మార్పులు తేవాలన్న ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ సంస్కరణలను తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ప్రశ్నపత్రం ఇలా..
ప్రశ్న పత్రం 4 సెక్షన్లుగా ఉంటుంది.
ఆబ్జెక్టివ్ విధానం- ఒక్క పదంలో సమాధానం రాయాలి. ఐచ్ఛికాలుండవు.
సూక్ష్మ లఘుప్రశ్నలు- ఒకటి లేదా రెండు వాక్యాల్లో అన్నింటికీ సమాధానాలు రాయాలి.
లఘు ప్రశ్నలు- రెండు, నాలుగు వాక్యాల్లో సమాధానాలు రాయాలి. ఐచ్చికాలుండవు.
వ్యాసరూప ప్రశ్నలు- ఛాయిస్ ఉంటుంది. అయితే, తెలుగు పేపర్-2లో రెండో ప్రశ్న, ఆంగ్లం పేపర్-1లో 35వ, పేపర్-2లో 28వ ప్రశ్నలకు ఛాయిస్ ఇవ్వలేదు.
సమాధాన పత్రం 24 పేజీలు ఉంటుంది, అదనపు పత్రాలు ఇవ్వరు.* ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు అదనంగా సమయం ఉంటుంది.
10లో పేపర్లవారీగా గ్రేడ్లు
➽ Download G.O.Ms.No.69

No comments:
Post a Comment