Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

అక్టోబర్‌ 15న అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం ( గ్లోబల్‌ హ్యాండ్‌ వాష్‌ డే) -- మన రాష్ట్ర విద్యా శాఖ జారీచేసిన ఆదేశాలమేరకు (15/10/19) ఉదయం 10 గంటలనుండి ఒంటి గంట వరకూ అన్ని పాఠశాలలో ఈ కార్యక్రమం పేరెంట్ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించాలి. --ఆ వివరాలు

అక్టోబర్‌ 15న అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం ( గ్లోబల్‌ హ్యాండ్‌ వాష్‌ డే)
మన రాష్ట్ర విద్యా శాఖ జారీచేసిన ఆదేశాలమేరకు  (15/10/19) ఉదయం 10 గంటలనుండి ఒంటి గంట వరకూ అన్ని పాఠశాలలో ఈ కార్యక్రమం పేరెంట్ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించాలి.
ఆ వివరాలు
10 to11-  7 అంచలపద్దతి లో సబ్బుతో చేతుల పరిశుబ్రత పిల్లలకు అవగాహన.-
11 to 12 పాఠశాల కమిటి సభ్యులు, ప్రజలు ,పిల్లలు ఉపాధ్యాయులతో గ్రామంలో ర్యాలీ  ప్రజా చైతన్యం.
 12 to 12-30 --హేండ్ వాష్ పై గ్రామస్తులకు పిల్లలకు సూచనలు
12-30to  1pm PC కమిటి సభ్యులతో హేండ్ వాష్ పై అవగాహనా సదస్సు
 తదుపరి పిల్లలతో హేండ్ వాష్ అనంతరం భోజనం
రోజూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వల్ల వ్యాధి కారక క్రిములు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. తినడానికి ముందు, బాత్‌రూమ్‌కు వెళ్లి వచ్చిన తర్వా త చేతులు శుభ్రం చేసుకోవడం ఎంతో మంచిదని చిన్నారులకు దీనిని అలవాటు చేయాలని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఏటా అక్టోబర్‌ 15న అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం ( గ్లోబల్‌ హ్యాండ్‌ వాష్‌ డే)గా పాటిస్తున్నారు

  చేతుల పరిశుబ్రత లేకపోవడం వల్ల    ప్రతీ సంవత్సరం అతిసార, శ్వాస కోస సంబంధింత వ్యాధులతో పిల్లలు అధిక సంఖ్యలో మర ణిస్తున్న నేపథ్యంలో 2008లో ఐక్యరాజ్య సమితి అక్టోబర్‌ 15న వరల్డ్‌ హ్యాండ్‌ వాష్‌డేగా ప్రకటించింది.

    అరచేతులు శుభ్రంగానే ఉన్నట్లు కనిపించినా కోటానుకోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయనే విషయాన్ని ఊహించలేం. నీళ్లతో చేతులు కడుక్కున్నా అవి పోవు. సబ్బుతో కానీ, హ్యాండ్‌ వాష్‌ ద్రావకంతో కాని దాదాపు 20 సెకన్లు కడుకుంటేనే శుభ్రంగా ఉన్నట్లు. ప్రతిరోజూ భోజనం చేయడానికి ముందు, మల విసర్జనకు వెళ్లొచ్చిన తర్వాత ఇలా చేతుల్ని శుభ్రపర్చుకోవడం మనల్ని ఎన్నో ఆరోగ్యాల బారి నుంచి రక్షిస్తోంది.
 
పరిశుభ్రతతో అనారోగ్యాలు దూరం చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల రోగాలు దరిచేరవు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ చాలా పనులు చేస్తుంటాం. భోజనం చేసినా, ముక్కు చీదినా, పేడతీసినా, పాలు పితికినా, ఇంకా పలు పనులు చేసేటప్పుడు ఆ పనికి సంబంధించిన మలినాలు చేతులకు అంటుకుంటాయి. ఆ చేతులను నీటితో శుభ్రం చేసుకోకుండా తాగడమో, తినడమో చేస్తాం. మల విసర్జన తర్వాత చేతులను శుభ్రం చేసుకోం. అలా అని కేవలం నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోదు. సబ్బుతో శుభ్రం చేసుకున్నప్పుడే క్రిములు శరీరంలోకి చేరవు.

దేశ జనాభాలో 45 శాతం మంది మాత్రమే చేతులు శుభ్రత పాటిస్తున్నారని ఒక సర్వేలో తేలింది. బాత్‌రూమ్‌కు వెళ్లిన తర్వాత 53 శాతం మంది మాత్రమే చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. వంటచేసే ముందు 30 శాతం మంది, ఆహారం తీసుకునే ముందు 38 శాతం మంది మాత్రమే శుభ్రం చేసుకుంటున్నారు.

ఆహారం తీసుకునే ప్రతిసారీ రెండు చేతులునూ కనీసం రెండుసార్లు సాధరణ సబ్బుతో కడగాలి. సబ్బు అందుబాటులో లేనిచో కనీసం నీటితో బాగా కడగాలి. కుళాయి ఉంటే ఫోర్స్‌గా తిప్పి చేతులు కడగాలి. కాళ్లు కడగడం తప్పనిసరి. ఆహారం తీసుకున్న తర్వాత చేతులు కడిగాక ఉతికిన పరిశుభ్రమైన కర్చీఫ్‌తోనూ, టవల్‌తోనూ చేతులను తుడుచుకోవాలి. టవల్‌ను, బట్టలను పొడిగా ఉంచాలి. గోళ్లలో మట్టి చేరకుండా కట్‌ చేసుకుంటూ ఉండాలి. వారానికి రెండుసార్లయినా తలస్నానం చేయాలి. దువ్వెనలో మట్టి లేకుండా చూసుకోవాలి. చేతుల పరిశ్రుభతపై ప్రజలకు పెద్దఎత్తున ప్రచారం చేసి అవగాహన కల్పించాలి.

వ్యాధులను కలిగించే అనేక రకాల సూక్ష్మజీవులు మట్టి, గాలిలోనే ఉంటాయి. ఇవి టైపాయిడ్‌, విరేచనాలు, రక్తహీనత తదితర వ్యాధులకు కారణాలవుతాయి. ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటాయి. కేవలం ఆహారం తీసుకునే ముందు, మామూలు సబ్బుతో  ఏడంచెల పద్దతిలో చేతులు వాష్‌ చేసుకుంటే పలు జబ్బులు అరికట్టొచ్చని  ఆరోగ్య సిబ్బంది , ఉపాధ్యాయులు తమ పాఠశాల పిల్లలకు ఈ విషయమై మెళకువలను నేర్పాలి .

15/10/2019 తేదీన నిర్వహణ అంశాలు.

Download కరదీపిక 

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND