Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

లాల్ బహదూర్ శాస్త్రి -- బయోగ్రఫీ

లాల్ బహదూర్ శాస్త్రి -- బయోగ్రఫీ 

 భారతదేశపు నిరాడంబర ప్రధానులలో ఒకరైన లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్ సరాయ్ గ్రామంలో 1904 అక్టోబర్ 2న జన్మించారు. ఎంతో దేశభక్తిగల ఆయన 1921లో సహాయ నిరాకరణోద్యమంలో అడుగుపెట్టారు. స్వాతంత్య్ర పోరాటంలో మొత్తం 9 సంవత్సరాలపాటు జైలులోనే గడిపారు. స్వాతంత్య్రం అనంతరం ఉత్రప్రదేశ్ రాష్ట్రమంత్రిగా పనిచేసి ఆ తరువాత 1951లో లోక్ సభ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్‌లాట్ నెహ్రూకు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత అతను భారతదేశ ప్రభుత్వంలో చేరి జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా (1951–56), తరువాత హోంమంత్రిగానేకాక ఇతర బాధ్యతలను కూడా చేపట్టాడు. నెహ్రూ అనంతరం ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.

అతను 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం కాలంలో దేశాన్ని నడిపించాడు. అతని నినాదం "జై జవాన్ జై కిసాన్" యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ప్రస్తుత కాలం వరకు ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయింది. ఈ యుద్ధం 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం పూర్తి అయినది. ఒప్పందం జరిగిన తరువాత దినం తాష్కెంట్లో అతను గుండెపోటుతో మరణించినట్లు చెప్పబడింది. కానీ ఈ మరణానికి అనేక కారణాలు చెప్పబడినప్పటికీ అది సి.ఐ.ఎ ద్వారా జరిగిన ప్రణాళికాబద్ధమైన హత్యగా చెప్పబడింది.

కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తూ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత రవాణా మంత్రిగా, హోంమంత్రిగా పనిచేశారు. 1964లో జవహర్ లాల్ నెహ్రూ ఆకస్మిక మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిగారు ప్రధానమంత్రి అయ్యారు. దేశం ఆర్ధిక సంక్షోభంలో ఉంటే గ్రీన్ రివల్యూషన్‌కు బాటలు వేశారు. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఒప్పందం కోసం రష్యా చేరిన లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ ఒప్పందంపైన 1966 జనవరి 10న సంతకాలు చేశారు. ఆ మర్నాడు 1966 జనవరి 11న గుండెపోటుతో తాష్కెంట్‌లోనే ఆయన మరణించారు. మరణానంతరం 1966లో భారత ప్రభుత్వం ఆయనకు 'భారతరత్న' ఇచ్చి గౌరవించింది.


ప్రారంభ జీవితం (1904–1917)

శాస్త్రి వారణాసి లోని రామనగర లో తన తల్లితరపున తాత గారింట కాయస్థ హిందూ కుటుంబంలో 1904 అక్టోబర్ 2న జన్మించాడు. ఆ కుటుంబం సాంప్రదాయకమైన చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్స్ . సివిల్ సర్వెంట్స్ ఉన్న నేపధ్యం కలది. అతని తండ్రి తరపున పూర్వీకులు వారణాసి దగ్గరలోని రామనగర లో జమీందారుల వద్ద పనిచేసేవారు. అతను జన్మించిన మొదటి సంవత్సరంలో ఇక్కడ పెరిగాడు. శాస్త్రి తండ్రి శారదా ప్రసాద్ శ్రీవాస్తవ ఉపాధ్యాయునిగా పనిచేసాడు. తరువాత అలహాబాద్ రెవెన్యూ కార్యాలయంలో గుమస్తాగా పనిచేసాడు. ఆమె తల్లి మొఘల్ సరాయ్ లోని రైల్వే పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. ఆంగ్ల ఉపాద్యాయునిగా పనిచేసిన మున్షీ హజారీ లాల్ కుమార్తె. శాస్త్రి రెండవ సంతానంగా పెద్ద కుమారునిగా జన్మించాడు. అతని అక్క పేరు కైలాష్ దేవి 

1906 ఏప్రిల్ లో శాస్త్రికి ఒక యేడాది వయస్సు ఉన్నప్పుడు, అతని తండ్రి డిప్యూటీ తహసీల్దారుగా పదోన్నతి పొందాడు కానీ ప్లేగు అనే అంటువ్యాధికి గురై మరణించాడు. ఆ సమయంలో 23 సంవత్సరాల వయస్సు గల రామ్‌దులారీ దేవికి మూడవ బిడ్డతో గర్భంతో ఉంది. ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి ఆమె తన కన్నవారి ఇంటికి (ముఘల్‌సరాయ్) వచ్చి అక్కడ స్థిరపడింది. ఆ కుటుంబాన్ని లాల్ బహదూర్ తాత ఆదుకుని వారికి ఆశ్రయం కలిగించాడు. అక్కడ ఆమె సుందరీ దేవి అనే కుమార్తెకు జూలై 1906 న జన్మనిచ్చింది. ఆ విధంగా శాస్త్రి ఆమె సొదరీమణులతో కలసి తాతగారైన హజారీ లాల్ ఇంటి వద్ద పెరిగాడు. అయినప్పటికీ హజారీలాల్ 1908లో గుండెపోటుతో మరణించాడు. తరువాత శాస్త్రి కుటుంబాన్ని తన మామయ్య దర్బారీ లాల్ చూసుకున్నాడు. దర్బారీలాల్ ఘజీపూర్ లోని "నల్లమందు నియంత్రణ విభాగం" లో ప్రధాన గుమస్తాగా పనిచేస్తూండేవాడు. తరువాత దర్బారీలాల్ కుమారుడు బిందేశ్వరి ప్రసాద్, ముఘల్‌సరాయ్ లో ఉపాద్యాయునిగా పనిచేసాడు.
అన్ని కాయస్థ కుటుంబాల మాదిరిగానే శాస్త్రి కుటుంబంలోని పిల్లలకు ఉర్దూ భాష, సంస్కృతిలో విద్యను అందించే ఆచారం ఉంది. ప్రభుత్వంలో ఆంగ్ల భాష రాక ముందు అనేక శతాబ్దాలుగా ఉర్దూ/పర్షియన్ భాషలు వాడబడుతున్నందున ఈ భాషలు నేర్చుకోవాలనే ఆచారం ఆనాడు ఉండేది. అందువలన శాస్త్రి తన నాలుగు సంవత్సరాల వయస్సులో ముఘల్‌సరాయ్ లోని తూర్పు మధ్య రైల్వే ఇంటర్ కళాశాలలో బుధన్ మిలన్ అనే మౌల్వీ (ముస్లిం పండితుడు) వద్ద విద్యను అభ్యసించాడు. అక్కడ 6వ తరగతి వరకు చదివాడు. 1917లో తన కుటుంబాన్ని పోషిస్తున్న మామయ్య బృందేశ్వర ప్రసాద్ కు వారణాసి కి బదిలీ అయింది. అందువల్ల కుటుంబం అంతా వారణాసి వెళ్లవలసి వచ్చింది. ఆ కుటుంబంతో పాటు రామ్‌దులారీ దేవి తన ముగ్గురు పిల్లలతో కలసి వారణాసి చేరింది. శాస్త్రి హరిష్ చంద్ర హైస్కూలు లో ఏడవ తరగతిలో చేరాడు.[1] ఇక్కడ అతను తన పేరులోని "శ్రీవాస్తవ" అనే ఇంటిపేరును వదిలివేసాడు.

స్వాతంత్ర్యోద్యమంలో పాత్ర  --భారత స్వాతంత్ర్యోద్యమం

శాస్త్రి 1928లో గాంధీజీ పిలుపుతో కాంగ్రెస్ లో చురుకైన, పరిపక్వత గల సభ్యునిగా మారాడు. 1930 లో ఉప్పు సత్యాగ్రహం లో అతను పాల్గొన్నాడు. దాని ఫలితంగా రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు.[12] తరువాత 1937 లో ఉత్తర ప్రదేశ్ పార్లమెంటరీ బోర్డులో ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసాడు.  1940 లో అతను స్వాతత్ర్య ఉద్యమానికి మద్దతుగా వ్యక్తిగత సత్యాగ్రహం నిర్వహించినందున ఒక సంవత్సరం పాటు జైలు లో ఉన్నాడు.

1942 ఆగస్టు 8 న దేశ వ్యాప్తంగా ఆంగ్లేయులు భారతదేశ్ం విడిచి పోవాలనే డిమాండ్ తో గాంధీజీ ముంబై లోని గోవిలియా టాంక్ వద్ద క్విట్‌ ఇండియా ఉద్యమం గూర్చి సందేశాన్నిచ్చాడు. శాస్త్రి ఒక సంవత్సర కాలం జైలుశిక్ష అనుభవించి విడుదలైన వెంటనే అలహాబాదుకు ప్రయాణమయ్యాడు. జవహర్ లాల్ నెహ్రూ గృహమైన ఆనందభవన్‌లో ఉన్న స్వాతంత్ర్య ఉద్యమకారులకు సూచనలను ఒక వారంపాటు పంపాడు. కొద్ది రోజుల తరువాత అతను అరెస్టు కాబడి 1946 వరకు జైలు శిక్ష అనుభవించాడు. [ శాస్త్రి స్వాతంత్యోద్యమంలో మొత్తం 9 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు.  అతను జైలులో ఉన్నకాలాన్ని పుస్తకాలు చదవడంతో గడిపాడు. పశ్చిమ దేశ తత్వవేత్తలు, విప్లవకారులు, సాంఘిక సంస్కర్తల కృషిని బాగా తెలుసుకున్నాడు.

రాజకీయ జీవితం (1947–64)

రాష్ట్ర మంత్రి

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత శాస్త్రి తన స్వంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో పార్లమెంటరీ సెక్రటరీగా నియమించబడ్డాడు. 1947 ఆగస్టు 15 న గోవింద్ వల్లభ్ పంత్ ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రివర్గంలో పోలీసు, రవాణా శాఖలకు మంత్రిగా వ్యవహరించాడు. రఫీ అహ్మద్ కిద్వాయ్ నిష్క్రమణ తరువాత కేంద్రంలో మంత్రిగా చేరాడు. అతను రవాణా శాఖా మంత్రిగా ఉన్నప్పుడు మొదటి సారిగా మహిళా కండక్టర్లను నియమించాడు. పోలీసు శాఖా మంత్రిగా అతను పోలీసులు ఎక్కువగా ఉన్న జన సమూహాలను పారద్రోలేటందుకు లాఠీ చార్జ్ కు బదులుగా వాటర్ జెట్ లు వాడాలని ఆదేశించాడు.  పోలీసు మంత్రిగా (తరువాత కాలంలో 1950 నుండి హోం మంత్రి) ఆయన పదవీకాలంలో 1947 లో శరణార్థుల వలసలు, పునరావాసం లో జరిగిన మత సంఘర్షణలను విజయవంతంగా అణచివేసాడు.

క్యాబినెట్ మంత్రి

1951లో శాస్త్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అతను ప్రచారం, ఎన్నికల కార్యకలాపాలు, అభ్యర్థుల ఎంపికకు పూర్తి బాధ్యత వహించాడు. అతని మంత్రివర్గంలో రతిలాల్ ప్రేం చంద్ మెహ్తా వంటి ఉత్తమమైన భారతీయ వ్యాపారవేత్తలు ఉండేవారు. అతను 1952, 1957, 1962 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలోముఖ్య పాత్ర పోషించాడు. 1952 లో ఉత్తర ప్రదేశ్ లోని సోరాన్ ఉత్తర (ఫూల్పూర్ పశ్చిమ) విధాన సభ నియోజక వర్గం నుండి పోటీ చేసి 69% ఓట్లతో విజయం సాధించాడు. ఉత్తరప్రదేశ్ హోం మంత్రిగా పదవినలంకరిస్తాడని నమ్మాడు కానీ కేంద్ర ప్రభుత్వంలో నెహ్రూ పిలుపు మేరకు తిరిగి కేంద్రానికి వెళ్లాడు. నెహ్రూ అతనికి 1952 మే 13 న తన మొదటి కేబినెట్ లో రైల్వే మంత్రి భాద్యతలను అప్పగించాడు.

భారత ప్రధానమంత్రి (1964–66)

1964లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత అతని స్థానాన్ని పూరించడానికై, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీదేశాయ్ సిద్దంగా ఉండగా, అప్పటి కాంగ్రేసు పార్టీ ప్రెసిడెంటు కామరాజ్ సోషలిస్టు భావాలున్న లాల్ బహదూర్ శాస్త్రికి మద్దతుపలికి ప్రధానమంత్రిని చేయడంలో సఫలీకృతుడయ్యాడు. లాల్ బహాదుర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభమును తాత్కాలికంగా పరిష్కరించడానికై విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేసాడు. తరువాత దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికై (గ్రీన్ రెవల్యూషన్) బాటలుపరిచాడు.

మరణం 

తాష్కెంట్ ఒప్పందం పై సంతకం చేసిన రోజున 02:00 గంటలకు అతను తాష్కెంట్ లో గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించబడినది. కానీ ప్రజలు మరణం వెనుక కుట్ర ఆరోపించారు. అతను విదేశంలో చనిపోయే భారతదేశ మొదటి ప్రధాన మంత్రి. అతనిని జాతీయ నాయకునిగా శ్లాఘిస్తూ అతని జ్ఞాపకార్థం విజయఘాట్ లో స్మారకం ఏర్పాటు చేసారు. అతను మరణించిన తరువాత భారత కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇందిరా గాంధీని ఎన్నుకొనే వరకు గుల్జారీ లాల్ నందా ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నాడు


No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND