Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

నేటి రేడియో పాఠం--తేది : 29.10.2019 - విషయము : పరిసరాల విజ్ఞానము -- పాఠం పేరు : "నది జీవన విధానం" --తరగతి : 5వ తరగతి - సమయం : 11-00 AM

"విందాం - నేర్చుకుందాం"
నేటి రేడియో పాఠం

★ తేది : 29.10.2019
★ విషయము : పరిసరాల విజ్ఞానము
★ పాఠం పేరు : "నది జీవన విధానం"
★ *తరగతి : 5వ తరగతి
★ సమయం : 11-00 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు
నది జీవన విధానం
బోధనా లక్ష్యాలు:
విద్యార్థినీ విద్యార్థులు :
• నదుల ఆవశ్యకత గురించి తెలుసుకుంటారు.
• గోదావరి ఏయే రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందో అవగాహన చేసుకుంటారు.
• నదులపై ఆధారపడికొందరు జీవనాధారం కొనసాగిస్తున్నారని గ్రహిస్తారు.
• నదీ తీర ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలుగా విలసిల్లుతున్నాయని గ్రహిస్తారు.
• నదీ తీర ప్రాంతాలలో ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయని అర్థం చేసుకొంటారు.
బోధనాభ్యసన సామగ్రి:* నల్లబల్ల, సుద్దముక్క, పాఠ్యపుస్తకం
ఆట :
ఆట పేరు నది - గట్టు
• తరగతిలో పెద్ద వృత్తం గీయవలెను.
• రేడియోలో మ్యూజిక్ వస్తున్నంత సేపు వృత్తం చుట్టూ పరిగెత్తుతుండాలి.
• రేడియో మ్యూజిక్ ఆగి, రేడియో టీచర్ "నది'" అనగానే వృత్తం లోపలకు దూకాలి.  "గట్టు" అనగానే వృత్తం బయటకు దూకాలి. ఇలా ఆట ఆడించాలి.
కార్యక్రమములో ప్రసారమయ్యే పాటను చార్డుపై స్పష్టంగా రాసి తరగతి గదిలో ప్రదర్శించాలి.
పాట
 పల్లవి :
గల గలా పరుగులెత్తి గోదావరి తల్లీ
తెలుగు వారి లోగిలిలో నీవు కల్పవల్లీ   //గల గలా//
 చరణం 1:
పడమటి కనుమలలో నీవు జనియిం చావు
ఆంధ్రాలో రావిగూడాన అడుగు పెట్టావు
వొంపు సొంపులతో నిండుగా ప్రవహించావు,
తెలుగు వాకిట సిరులెన్నో కురిపించావు    //గల గలా //
 చరణం 2:
చక్కని అందాలు పంచే దక్షిణ గంగవయ్యావు
ఎందరికో ఉపాధి నిచ్చి గోదారి తల్లివయ్యావు
మంచి జలము నిచ్చి గోదావరి వయ్యావు
మన పుడమి తల్లినే పులకింపజేశావు  //గల గలా //
 చరణం 3:
నీ సుదీర్ఘ పయనంలో ప్రాజెక్టులెన్నో నిలిపావు
రైతులకు సిరుల నిచ్చే కల్పతరువై నిలిచావు
ఆలయాల కెన్నింటికో ఆలవాలమైనావు
జనులందరికీ సుఖ శాంతులు ప్రసాదించావు.   //గల గలా //
పాట ప్రసార సమయంలో
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND