విద్యాలయాలకు వాలంటీర్లు
● జిల్లాలో 800 మంది నియామకానికి ప్రభుత్వం అనుమతి
● ఉపాధ్యాయుల కొరత ప్రభావం విద్యా బోధనపై పడకుండా చర్యలు
తూర్పుగోదావరి
➽ జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయుల కొరత వెంటాడుతోంది. ఓ వైపు వార్షిక పరీక్షలు సమీపిస్తుండడం.. మరో వైపు డీఎస్సీ నియామకాల్లో జాప్యం కారణంగా విద్యా బోధన ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా విద్యా వాలంటీర్లను నియమించాలని నిర్ణయించింది.
➽ జిల్లాలో జడ్పీ, మండల పరిషత్తు, పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో 4,406 పాఠశాలలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 16 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 2018 డీఎస్సీ ద్వారా 997 ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టినా పలు సమస్యలతో నియామకాలు పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో 1,823 మంది (ప్రాథమిక -1,030, ప్రాథమికోన్నత - 427, ఉన్నత ..మిగతా 7లోపాఠశాలల్లో 366 మంది) వాలంటీర్లు అవసరమని విద్యా శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీనికి స్పందించిన ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన 800 మంది విద్యా వాలంటీర్ల నియామకానికి అనుమతిచ్చింది.
➽ ప్రాథమిక పాఠశాలల్లో బోధించే వాలంటీర్లకు రూ.5 వేలు, ఉన్నత పాఠశాలల్లో పని చేసే వారికి రూ.7 వేల చొప్పున గౌరవ వేతనాన్ని చెల్లిస్తారు.జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు అధికంగా ఉన్న నేపథ్యంలో సుమారు 500 మంది వాలంటీర్లను అక్కడే భర్తీ చేసే అవకాశం ఉంది. నగరపాలక సంస్థ పాఠశాలల్లో ప్రత్యేకంగా విద్యా వాలంటీర్ల నియామకానికి పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది.
దీనిపై జిల్లా విద్యా శాఖ అధికారి ఎస్.అబ్రహం ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ జిల్లాలో విద్యా వాలంటీర్ల పోస్టులను
మంజూరు చేస్తూ ప్రభుత్వం నుంచి సమాచారం అందిందని తెలిపారు.
➽ జిల్లాకు 1,823 మంది వాలంటీర్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించగా 800 మందిని నియమించుకునేందుకు అనుమతించిందని చెప్పారు. మార్గదర్శకాలు వచ్చిన వెంటనే నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు.

No comments:
Post a Comment