తొలిదశ 1నుంచి 6వ తరగతి వరకే ఆంగ్లంలో బోధన
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టనున్నఆంగ్లమాధ్యమ బోధనకు సంబంధించి సీఎం జగన్ తాజాగా విద్యాశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. తొలి దశలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు మాత్రమే ఆంగ్ల మాధ్యమాన్ని వర్తింపచేయాలని ఆదేశాలు జారీచేశారు. తాడెపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపిన సీఎం పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకోసం పలు నిర్ణయాలను ప్రకటించారు.
ఈనెల14 నుంచి ప్రారంభం కానున్న నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల భాషకు చెందిన ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. పాఠశాలల్లో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విధానాలను పాటించాల్సిందిగా సూచించారు. 1 నుంచి 6 తరగతుల వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధించేందుకు పాఠశాలల్లో తగు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులకు చెప్పారు.

స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంపై సీఎం వైఎస్ జగన్ క్లారిటీ..
తొలిదశలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు మాత్రమే ఇంగ్లీష్ మీడియాన్ని వర్తింపజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనపై ఏపీలో దుమారం రేగుతోంది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తే రాబోయే రోజుల్లో తెలుగు భాష కనుమరుగయ్యే ప్రమాదముందని ప్రజా సంఘాలు, విద్యావేత్తలు, తెలుగు పండితులు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. శనివారం విద్యాశాఖ అధికారులో సమీక్ష నిర్వహిచంచిన వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలిదశలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు మాత్రమే ఇంగ్లీష్ మీడియాన్ని వర్తింపజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాదు ప్రతి పాఠశాలలలోనూ ఇంగ్లీష్ భాషకు సంబంధించి ల్యాబ్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. నవంబరు 14 నుంచి ప్రారంభమయ్యే నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రతి స్కూళ్లో ఇంగ్లీష్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తొలి దశలో ఆరో తరగతి వరకు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో బోధించాలని.. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు సీఎం జగన్. ఇక నవంబరు 14న ప్రకాశం జిల్లాలో నాడు-నేడు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఒంగోలు, కొత్తపట్నంలోని పలు పాఠశాలలను సందర్శించి క్లాస్ రూమ్‌లు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలిస్తారు. అనంతరం ఒంగోలులోని పీవీఆర్ బాలుర పాఠశాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
No comments:
Post a Comment