14 నుంచి ‘నాడు-నేడు’
45 వేల పాఠశాలల్లో ప్రారంభం
పేరెంట్స్ కమిటీల భాగస్వామ్యం
విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్ వెల్లడి
‘‘రాష్ట్రంలోని 45వేల పాఠశాలల్లో 14 నుంచి ‘నాడు-నేడు’ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా తొమ్మిది రకాల పనులను చేపడతాం. ప్రతి పాఠశాలలోనూ మరుగుదొడ్లు, కాంపౌండ్‌వాల్, తాగునీరు, నీటి పారుదల, ఫర్నిచర్, ఫ్యాన్లు, బ్లాక్ బోర్డులు, లైటింగ్, పెయింటింగ్.. తదితర సౌకర్యాల ఏర్పాటును పరిశీలించి ఇప్పటి వరకు ఎలా ఉన్నాయి.. ఇకపై ఎలా ఉండాలి.. అనే విషయంపై దృష్టి పెట్టి అలా చేపడతాం’’ అని సీఎం జగన్ తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన పాఠశాల విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. తొలుత పాఠశాలల్లో చేపట్టే నాడు-నేడు కార్యక్రమాన్ని తర్వాత దశలో జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐలు, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ‘నాడు-నేడు’ కింద ప్రతి పాఠశాలలోనూ చేపట్టాల్సిన పనులపై ‘చెక్ లిస్ట్’ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీలను భాగస్వాములను చేస్తామని చెప్పారు.
అంతా ఇంగ్లి్‌షలోనే!
ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది 1- 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతున్నామని, ఆపై వచ్చే సంవత్సరం నుంచి 9, 10తరగతుల్లో కూడా ఇంగ్లిష్ మీడియంలోనే బోధన ఉంటుందని జగన్ వివరించారు. స్కూలు ప్రారంభం కాగానే విద్యార్థులకు యూనిఫాం, బూట్లు, పుస్తకాలు ఇవ్వాలన్నారు. పాఠశాలలు తెరిచిన తర్వాత సెప్టెంబరు, అక్టోబరు వరకు పుస్తకాలు ఇవ్వని పరిస్థితి ఉండకూడదన్నారు. ‘నాడు-నేడు’ కార్యక్రమానికి సంబంధించి సరైన ప్రణాళిక ఉండాలని, ఆర్థిక వనరుల లోటు లేకుండా చూసుకోవాలని సూచించారు. మండలంలో మంచి హైస్కూల్‌ను గుర్తించి జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లు ఉండేలా జాగ్రత్త వహించాలన్నారు.

No comments:
Post a Comment