వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేస్తున్నారా?
➧ఇంటర్నెట్‌డెస్క్: వాట్సప్‌లో ఉన్న అద్భుతమైన ఫీచర్లలో గ్రూప్ ఒకటి. స్నేహితులు, బంధువులతో ఎప్పటికప్పుడు సంబంధాలు కలిగి ఉండేందుకు ఇది ఉపయోపడుతుంది. ఎంత ఉపయోగకరమో అదే స్థాయిలో దీంతో ఇబ్బందులూ ఉన్నాయి. మన ఫోన్ నంబర్ సంపాదించిన వ్యక్తో లేదా మనకు తెలిసిన వ్యక్తో ఏదో ఒక గ్రూప్‌లో మనల్ని యాడ్ చేసేస్తుంటారు. ఇక అవతలి వారు ఏమనుకుంటారోనన్న సందేహంతో.. అటు బయటకు రాలేక ఇవతల ఉండలేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వాట్సప్ ఓ అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ కింద ఇకపై ఎవరూ మీ అనుమతి లేకుండా గ్రూప్‌లో చేర్చడం సాధ్యపడదు.
➧ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే మీ వాట్సప్ అప్‌డేట్ చేసి ఉండాలి. మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే 2.19.308 వెర్షన్ వాడుతుండాలి. అదే ఐఫోన్ వినియోగిస్తుంటే 2.19.112 వెర్షన్‌లో ఉండాలి. అలా లేని వారు వెంటనే యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సప్‌లో మూడు చుక్కలున్న మెనూలోకి వెళ్లి సెట్టింగ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. అందులో అకౌంట్> ప్రైవసీలోకి వెళ్లాలి. అందులో గ్రూప్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. మీకు ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సప్ట్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి.
➧ఎవరూ యాడ్ చేయకూడదనుకుంటే ‘ఎవ్రీవన్’ ఎంచుకోవాలి. ‘మై కాంటాక్ట్స్’ ఎంచుకుంటే మీ ఫోన్ బుక్‌లో ఉన్నవారికి మాత్రమే యాడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక మూడో ఆప్షన్‌ను ఎంచుకుంటే కొందరు మాత్రమే మిమ్మల్ని యాడ్ చేసే వీలుంటుంది. ఒకసారి ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నాక మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేసినప్పుడు మీకు ఇన్‌వైట్ ఆప్షన్ వస్తుంది. మూడు రోజుల్లో సమ్మతి/ తిరస్కరణ తెలియజేయకుంటే దాని కాలపరిమితి ముగిసిపోతుంది.
ఎవరూ చూడకుండా..
➧మీ వాట్సాప్ చాటింగ్‌ను ఎవరూ చూడకుండా ఉండాలంటే వాట్సప్ ఫింగర్ ప్రింట్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. అందుకోసం మీరు ఫింగర్‌ప్రింట్ స్కానర్ కలిగిన ఫోన్‌ను వినియోగిస్తుండాలి. అయితే వాట్సప్ ఆండ్రాయిడ్ 2.19.221 లేదా ఆ పైబడిన వెర్షన్‌ను వాడుతున్నవారు ఈ ఫీచర్‌ను వినియోగించొచ్చు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడానికి అకౌంట్> ప్రైవసీ> ఫింగర్‌ప్రింట్ లాక్ ఆప్షన్‌ను ఎంచుకుని దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. వాట్సప్ క్లోజ్ చేసిన వెంటనే లాక్ అవ్వాలా?ఒక నిమిషం తర్వాత అవ్వాలా? 30 నిమిషాల తర్వాత అవ్వాలా? అనే మూడు రకాల ఆప్షన్లలో మీరు ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

No comments:
Post a Comment