"విందాం - నేర్చుకుందాం"
నేటి రేడియో పాఠం
★ తేది : 11.12.2019
★ విషయము : తెలుగు
★ పాఠం పేరు : "గాలిపటం"
★ తరగతి : 3వ తరగతి
★ సమయం : 11-00 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు
గాలిపటం
బోధనా లక్ష్యాలు:
విద్యార్థినీ విద్యార్థులు :
• సంభాషణల ద్వారా పాఠ్యాంశాన్ని అవగాహన పరచడం.
• “ఆత్మకథ" ప్రక్రియ పై అవగాహన కల్పించడం, పిల్లలు 'ఆత్మకథ' రాసే విధంగా ప్రోత్సహించడం.
• పాఠ్యసారాంశాన్ని సొంతమాటల్లో చెప్పగల్గుతారు, రాయగల్గుతారు.
• విన్న అలాగే చదివిన అంశం పై ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలుగుతారు.
• పొడుపు కథలపై అవగాహన పొందుతారు, అలాగే భాషాభాగాలకు ఉదాహరణలు ఇవ్వగలుగుతారు.
• పాట ద్వారా పాఠ్యసారాంశాన్ని అవగాహన పొంది పాటను సొంతంగా పాడగలుగుతారు.
బోధనాభ్యసన సామాగ్రి:
1. పాఠ్య పుస్తకం
2. నోటు పుస్తకాలు
3. పెన్నులు/పెన్సిల్లు
4. తెల్లకాగితాలు
5. పాఠ్య పుస్తకంలోని 90వ పేజీలో ఉన్న 'ఇ' కృత్యంలో ఉన్న పొడుపు కథలను 5 చీటీల పై రాసి ఉంచాలి.
6. “నామవాచకం' ఈ పదాన్ని 3 కాగితపు చీటీల పైనా, “సర్వనామం' ఈ పదాన్ని మరో 3 కాగితపు చీటీల పైనా రాసి ఉంచాలి.
7. “పాటను' రాసి ఉంచిన చార్టు.
వీటిని రేడియో పాఠం ప్రసార సమయంలో రేడియో టీచర్ సూచనలు ప్రకారం ఉపయోగించాలి.
ప్రసార పూర్వ కృత్యాలు
కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాలపై స్పష్టమైన అవగాహన కలిగియుండాలి.
ఆట :
_వృత్తం చుట్టూ తిరుగుదాం! పొడుపుకథలు, భాషాభాగాలు చెబుదాం!_
• రేడియో టీచర్ సూచనలను పాటిస్తూ ఆటను ఆడించాలి.
• పిల్లలను వృత్తాకారంగా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నిల్చోమనాలి.
• మ్యూజిక్ రాగానే చేతులు విడిచి పెట్టకుండా, వృత్తం చుట్టూ తిరగాలి.
• ఆగమన్నప్పుడు ఆగాలి, రేడియో టీచర్ సూచనల ప్రకారం చేయాలి.
• 'ఆటలో' భాషాభాగాలకు ఉదాహరణలు, పొడుపు కథలకు సమాధానాలు ఒక్కొక్కో విద్యార్థితో చెప్పించాలి.
కృత్యం -1
• రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు ఒక్కొక్క విద్యార్థితో సమాధానం చెప్పించాలి. రాజు, లతలు చెప్పే సమాధానాలను వినేలా చూడాలి.
కృత్యం - 2
• తెలుగు పాఠ్యపుస్తకంలోని 87వ పేజిలోని, నాలగవ పేరాను పిల్లలందరు చదివేలా చూడాలి.
• రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు ఒక్కొక్క విద్యార్థితో సమాధానం చెప్పించాలి.
పాఠ్యాంశ సంబంధిత రేడియో వినిపించబోయే పాట:
ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటను చార్టు పై స్పష్టంగా రాసి, తరగతి గదిలో ప్రదర్శించాలి.
పాట
పల్లవి :
రంగు రంగుల గాలి పటమా!
నింగి నెగిరే గాలిపటమా!
బాలలందరి నేస్తమా!
బాలలందరి నేస్తమా! //రంగు రంగుల//
చరణం 1:
రెక్కలొక్కటి నీకు తక్కువ
చక్కనీ ఓ గాలిపటమా!
పడగ విప్పీ ఆడుచుంటే
పాములా కనిపింతువే! //రంగు రంగుల//
చరణం 2:
దారమే ఆధారమైనా
దరికి తప్పగ వత్తువే!
చిక్కు పడినా, ముక్కలైనా!
దక్కకుందువు గాలిపటమా! //రంగు రంగుల//
పాట ప్రసార సమయంలో
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.

No comments:
Post a Comment