సీఎం జగన్‌కు నివేదిక ఇచ్చిన జీఎన్‌రావు కమిటీ
తాడేపల్లిలోని CM జగన్ నివాసంలో ఆయనతో జీఎన్‌రావు కమిటీ సమావేశమైంది. రాజధానితో పాటు ఏపీ సమగ్రాభివృద్ధిపై పలు ప్రాంతాల నుంచి వచ్చిన 40వేలకు పైగా వినతులను పరిశీలించిన కమిటీ.. సీఎంకు తుది నివేదికను అందించింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అధ్యయనం చేసిన ఈ కమిటీ.. ఇప్పటికే మధ్యంతర నివేదికను ఇచ్చి, ఇప్పుడు తుది నివేదికను అందించింది. దీంతో ఈ నివేదికలో ఏముందనే ఉత్కంఠ నెలకొంది.
అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి: కమిటీ
ఏపీ సమగ్రాభివృద్ధికి సంబంధించి ప్రధానంగా 2 అంశాలపై నివేదిక ఇచ్చినట్లు జీఎన్‌రావు కమిటీ తెలిపింది. రాష్ట్రంలో రీజినల్ బ్యాలెన్స్‌డ్ కమిటీని ఏర్పాటు చేయాలని.. అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా నివేదిక ఇచ్చినట్లు తెలిపింది. ఏపీలోని పలు చోట్ల ప్రాంతీయ అసమానతలు ఉన్నాయని.. వీటి మధ్య సమతూకం సాధించాలని తమ నివేదికలో పేర్కొన్నామని కమిటీ చెప్పింది. సహజ వనరులు అన్ని ప్రాంతాలకు సమానంగా వర్తించేలా చూడాలంది.
ఏపీని 4 ప్రాంతాలుగా విభజించాలని చెప్పాం: జీఎన్ రావు కమిటీ
ఏపీని 4 ప్రాంతాలుగా విభజించాలని చెప్పినట్లు జీఎన్‌రావు కమిటీ తెలిపింది. శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం
జిల్లాలు ఒక ప్రాంతంగా, కృష్ణా, గోదావరి జిల్లాలు మరో మండలిగా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు మూడో మండలి, సీమ నాలుగు జిల్లాలు మరో మండలిగా ఉండాలని ఈ కమిటీ అభిప్రాయపడింది. తీర ప్రాంత జిల్లాలో అభివృద్ధికి సంబంధించిన ఒత్తిడి ఎక్కువగా ఉందని, పట్టణీకరణ కోస్తా జిల్లాల్లోనే ఎక్కువగా ఉందని పేర్కొంది.
4 ప్రాంతాలు.. 3 పాలనా కేంద్రాలుగా ఆంధ్రప్రదేశ్
ఏపీకి రాజధాని ఏదన్న దానిపై GNరావు కమిటీ స్పష్టత ఇవ్వలేదు. అది చెప్పడం, నిర్ణయించడం తమ పని కాదని అభిప్రాయపడింది. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని 4 ప్రాంతాలుగా విభజిస్తే.. ప్రజలు కూడా ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. ప్రతీ దానికి కర్నూలు, విశాఖ, అమరావతి అని తిరగాల్సిన అవసరం లేదన్న ఈ కమిటీ.. రాష్ట్రాన్ని 4 ప్రాంతాలు, 3 పాలనా కేంద్రాలుగా మార్చాలనే సూచించామంది.
కర్నూలులోనే హైకోర్టు: జీఎన్‌రావు కమిటీ
ఏపీ హైకోర్టును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ అభిప్రాయపడింది. అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించిన ఈ కమిటీ.. ఏపీ అసెంబ్లీ తుళ్లూరులోనే ఉండాలని చెప్పామంది. విశాఖలో సచివాలయం, సీఎం క్యాంప్ కార్యాలయం, వేసవి అసెంబ్లీ ఉండాలని తమ నివేదికలో పేర్కొన్నట్లు కమిటీ సభ్యులు చెప్పారు. 13 జిల్లాల్లో దాదాపు 10వేల కి.మీ మేర తిరిగి ఈ నివేదిక రూపొందించామన్నారు.
ఏపీ అసెంబ్లీ అమరావతి లోనే
ఏపీ అసెంబ్లీని అమరావతిలోనే ఉంచాలని ప్రభుత్వానికి సూచించినట్లు జీఎన్‌రావు కమిటీ పేర్కొంది. అసెంబ్లీతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల భవనాలు, రాజ్‌భవన్, వివిధ శాఖల కార్యాలయాలు అమరావతి, మంగళగిరి, తుళ్లూరులోనే ఉండాలని చెప్పినట్లు పేర్కొంది. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలని సూచించామంది. అటు వీటితో పాటు అదనంగా అమరావతిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామంది.
పరిపాలన రాజధానిగా విశాఖ
AP: పరిపాలన రాజధానిగా విశాఖ ఉండాలని జీఎన్ రావు కమిటీ అభిప్రాయపడింది. తుళ్లూరులో అసెంబ్లీ, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఉండాలన్నారు. ఏపీని నాలుగు.. ఉత్తర, మధ్య, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్‌లుగా విభజించాలని సీఎం జగన్‌కు నివేదిక ఇచ్చినట్లు కమిటీ తెలిపింది. అటు రాజధానిపై ఆన్‌లైన్‌లో కూడా అభిప్రాయలను సేకరించామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
విశాఖ, కర్నూలులో సంబరాలు.. అమరావతిలో ఆందోళనలు
AP: G.N రావు కమిటీ సిఫార్సులపై విశాఖ, కర్నూలులో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. విశాఖలో సెక్రటేరియట్, CM క్యాంప్ ఆఫీస్, సమ్మర్ అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కమిటీ చేసిన ప్రతిపాదనలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న కమిటీ సిఫార్సుపై సీమ వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. అటు తమకు అన్యాయం చేశారని అమరావతిలో రైతులు ఆందోళన చేస్తున్నారు.
➧మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment