Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

నేటి రేడియో పాఠం - తేది : 06.01.2020 - విషయము : తెలుగు - పాఠం పేరు : " మనసుంటే మార్గం ఉంది" - తరగతి : 5వ తరగతి

"విందాం - నేర్చుకుందాం"
నేటి రేడియో పాఠం
★ తేది : 06.01.2020
★ విషయము : తెలుగు
★ పాఠం పేరు : " మనసుంటే మార్గం ఉంది"
★ తరగతి : 5వ తరగతి
★ సమయం : 11-00 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు

మనసుంటే మార్గం ఉంది

బోధనా లక్ష్యాలు:
విద్యార్థినీ విద్యార్థులు :
• సమాజంలోని వివిధ రకాల వ్యక్తులను పరిశీలిస్తారు, వారి వారి సామర్ధ్యాలను అంచనా వేయగలుగుతారు.
• చేతులు లేని జోత్స్న అన్ని పనులను కాళ్ళలోనే ఎలా సమర్ధవంతంగా నిర్వహిస్తుందో అర్ధం చేసుకుంటారు.
• సమాజంలో అటువంటివారిని గమనించినప్పుడు వారి కృషిని, పట్టుదలను అభినందిస్తారు.
• చేయాలనే కోరిక, పట్టుదల ఉంటే కష్టమైన పనులను కూడా సాధించవచ్చని గ్రహిస్తారు.
• చదివిన విషయాన్ని విశ్లేషించుకోని సొంత నూటల్లో వ్యక్త పరచగలుగుతారు
• ఆట, పాటల ద్వారా శారీరక, మానసికోల్లాసాలను పొందుతారు
• సూచనలకు అనుగుణంగా అభినయించగలుగుతారు.
• జీవితంలో తాను సాధించాల్సిన, చేరుకోవాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకుంటారు.

బోధనాభ్యసన సామగ్రి:
1. పాఠ్యపుస్తకం 2. అవయవలోపాలున్నప్పటికీ ప్రసిద్ధులైన వ్యక్తుల చిత్రాలు 3. వివిధ రకాల కుట్లు, అల్లికలు చేసిన వస్త్రాలు (ఎంబ్రాయిడరీ చేసిన వస్త్రాలు)

ప్రసార పూర్వకృత్యాలు:  (అ) కార్యక్రమంలో నిర్వహించే 'ఆట' ఆడించే విధానం గూర్చి తెలుసుకొని ఉండాలి.
ఆట 1 : రేడియోలో మ్యూజిక్ వస్తున్నంత సేపు రేడియో టీచర్ సూచనలకు అనుగుణంగా తరగతిలోని పిల్లలు అభినయించాలి.
1. కళ్ళుమూసుకొని నడవడం 2. ఆకలి వేస్తుంది - అన్నం కావాలని సై గల ద్వారా తెలియజేయడం 3. ముసలి వారు కర్ర పట్టుకొని నడుస్తున్నట్లు 4. సెల్లో మాట్లాడుతున్నట్లుగా
ఆట 2 : పిల్లలంతా వృత్తాకారంగా నిల్చోవాలి:
• మ్యూజిక్ వస్తున్నంత సేపు ‘నేల-బండ' అంటూ పిల్లలంతా వృత్తాకారంలో తిరగాలి.
• రేడియో టీచర్ 'నేల' అన్నప్పుడు పిల్లలంతా కూర్చోవాలి.
• రేడియో టీచర్ “బండ' అన్నప్పుడు పిల్లలంతా చేతులు తలపై పెట్టుకొని నిలబడాలి.
ఆ) కార్యక్రమంలో నిర్వహించే కృత్యాలపై అవగాహాన కలిగి యుండాలి.
కార్యక్రమంలో నిర్వహించవలసిన బోధనాభ్యసన కృత్యములు :
• రేడియో టీచర్ సూచనలను పాటిస్తూ, అవసరమైనచోట నల్లబల్లను వినియోగించండి. పిల్లలకు వివరించండి.
కృత్యం-1 :సంభాషణల రూపంలో నిన్న పాఠ్యాంశంపై రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు తరగతీలోని పిల్లలచే సమాధానాలు చెప్పించాలి.
కృత్యం 2: పాఠ్యపుస్తకం 59వ పేజీలోని మొదటి పేరాను పిల్లలంతా అర్ధం చేసుకుంటూ చదువుకోవాలి.
• చదివిన పేరాలోని అంశాలకు సంబంధించి రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు తరగతిలోని పిల్లలచే సమాధానాలు చెప్పించాలి.
కృత్యాం 3: ఆటలో భాగంగా రేడియో టీచర్ చెప్పే క్రియా పదాలను తరగతిలోని టీచర్ నల్లబల్ల పై రాయాలి.
• ఒక్కొక్క క్రియా పదాన్ని ఉపయోగించి ఒక్కొక్క విద్యార్ధిచే సొంత వాక్యం చెప్పించాలి.
• క్రియాపదాలు 1. చూసింది 2. తెచ్చాడు3. పాడింది 4. తిన్నది 5. వెళ్ళాడు
• ఇలా రేడియో టీచర్ సూచనలకు అనుగుణంగా ఒకరి తరువాత మరొకరిచే ఆటను ఆడిస్తూ కృత్యాన్ని నిర్వహించాలి.

కార్యక్రమంలో వినిపించబోయే పాటను పెద్ద అక్షరాలతో ఒక చార్డుపై రాసి, ప్రసార సమయంలో పిల్లలందరికీ కనిపించేలా తరగతి గదిలో ప్రదర్శించాలి.
      పాట
 పల్లవి :
వినరండి నినరండి బాలలారా
విశ్వాసంతో వికసించిన జ్యోత్స్న కథనూ
పట్టుదల వీడకుండ పయనించీ
పదుగురిలో పేరొందిన జ్యోత్స్న కథనూ   //వినరండి...//

 చరణం 1:
చేతులే లేవని దిగులు చెందక
కాళ్ళనే చేతులుగా చేసుకున్నదీ
అందంగా అందరితో ఆటలెన్నో ఆడింది.
పసిపాపలతో కలిసి పాటలేన్నో పాడింది  //వినరండి...//

 చరణం 2:
మనసుంటే తప్పకుండ మార్గముందనీ
పనులన్నీ పట్టుదలతో నేర్చుకున్నదీ
డిజైన్లన్నో దుస్తులపై కుట్టీ చూ పెను
గొప్ప కళాకారిణిగా కీర్తిపొందెను .   //వినరండి...//

పాట ప్రసార సమయంలో
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND