Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

సందేహాలు --- సమాధానాలు

సందేహాలు --- సమాధానాలు
ప్రశ్న:1  UP స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ అదే మండలం నకు FAC MEO గా భాద్యత లు నిర్వహించుచున్న అతని వార్షిక ఇంక్రిమెంట్లు, ELs ఎవరు మంజూరు చేస్తారు?
జవాబు:  FR.49 ప్రకారం ఒక పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహించుచున్న సందర్భంలో ఆ పోస్టుకి గల అన్ని అధికారాలు సంక్రమిస్తాయి.కనుక వార్షిక ఇంక్రిమెంట్లు తనే మంజూరు చేసుకోవచ్చు. ELs మాత్రం DEO గారి ఆనుమతి తో జమ చేయవలసి ఉంటుంది.
ప్రశ్న:2  SGT గా పనిచేస్తున్న టీచర్ VRO గా ఎంపిక ఐతే పే--ప్రొటెక్షన్,సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందా?
జవాబు:  DEO అనుమతి తో పరీక్ష రాస్తే వేతన రక్షణ ఉంటుంది. జీఓ.105 తేదీ:2.6.2011 ప్రకారం నూతన పోస్టు యొక్క స్కేల్ లో ప్రస్తుతం పొందుతున్న వేతనానికి సమానమైన స్టేజి లో వేతనం నిర్ణయించబడుతుంది. ఇంక్రిమెంట్ మాత్రం నూతన సర్వీసు లో చేరిన ఒక సంవత్సరం తర్వాతే మంజూరు చేస్తారు.
ప్రశ్న:3  మహిళా టీచర్ భర్త నిరుద్యోగి.అత్త, మామ కూడా ఈమె పైనే ఆధార పడి జీవిస్తున్నారు.అత్త గారికి ఆరోగ్యం బాగా లేదు.మెడికల్ రీ ఎంబర్సుమెంట్ వర్తిస్తుందా?
జవాబు:  APIMA రూల్ 1972 ప్రకారం వర్తించదు. కేవలం మహిళా టీచర్ అమ్మ,నాన్న లకి మాత్రమే వర్తిస్తుంది.*
ప్రశ్న:4  నాకు మొదటి సారి అమ్మాయి. తర్వాత కవల పిల్లలు జన్మించారు. LTC లో ముగ్గురు పిల్లలు ప్రయాణం చేయవచ్చా?
జవాబు:  జీఓ.140 తేదీ:3.4.96 ప్రకారం ఇద్దరు పిల్లలుకి మాత్రమే అవకాశం ఉంది.
ప్రశ్న:5  అబార్షన్ కి రెండుసార్లు మాత్రమే సెలవు ఉపయోగించుకోవాలి అనుచున్నారు. వాస్తవమా? కాదా?*
జవాబు:  జీఓ.254;ఆర్ధిక;తేదీ:10.11.95 ప్రకారం ఇద్దరు కంటే తక్కువ జీవించియున్న బిడ్డలు గలవారు అర్హులు. అంతేకానీ ఎన్నోసారి అనే దానితో నిమిత్తం లేదు.
----------------------------------------------
సందేహాలు -- సమాధానాలు
ప్రశ్న:1  అడ్మిషన్ రిజిస్టర్ లో ఒక పుట్టిన తేదీ ఉంది. మున్సిపాలిటీ/కార్పొరేషన్ వారు ఇచ్చిన సెర్టిఫికెట్ లో మరొక పుట్టిన తేదీ ఉంది. మున్సిపాలిటీ సెర్టిఫికెట్ ప్రకారం పుట్టిన తేదీ నామినల్ రోల్స్ లో మార్చమని పేరెంట్స్ అడుగుతున్నారు. అలా మార్చవచ్చా?
జవాబు:  SSC రూల్స్ 6 ప్రకారం తనిఖీ అధికారి అనుమతితో మార్పు చేయవచ్చు.
ప్రశ్న:2  ఒక టీచర్ జూన్ నుంచి డిసెంబరు వరకు ప్రసూతి సెలవులో ఉన్నారు.ఆమె ఇంక్రిమెంట్ అక్టోబర్ నెలలో ఉంది.ఆమెకు ఇంక్రిమెంట్ ఎప్పటి నుంచి ఇవ్వాలి?
జవాబు:  జీఓ.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ఇంక్రిమెంట్ అక్టోబర్ 1 నుండి మంజూరు చేస్తూ, ఆర్ధిక లాభం విధులలో చేరిన తేదీ నుంచి మంజూరు చెయ్యాలి.
ప్రశ్న:3  ఐటీ కేవలం ఫిబ్రవరి జీతంలోనే మినహాయించాలా?
జవాబు:  ఐటీ నిబంధనలు ప్రకారం చెల్లించవలసిన ఐటీ ముందే అంచనా వేసి మార్చి నెల జీతం నుండి ప్రారంభించి నెలనెలా మినహాయించాలి. ప్రతి క్వార్టర్ కి రిటర్న్స్ ఐటీ శాఖకు సమర్పించాలి. ఈ భాద్యత DDO లదే.
ప్రశ్న:4  ఒకరు మిలటరీ లో చేసి రిటైర్మెంట్ అయి, మరల sgt గా చేరి రిటైర్డ్ అయ్యారు. ఇపుడు అతనికి రెండు పెన్షన్లు వస్తాయా?
జవాబు:  ఏపీ పెన్షన్ రూల్స్ ప్రకారం రెండు పెన్షన్లు పొందవచ్చు.
ప్రశ్న:5  నేను SA క్యాడర్ లో 12 ఇయర్స్ స్కేల్ పొందాను. ఇటీవల HM గా పదోన్నతి వస్తే వదులుకున్నాను. ప్రస్తుతం నాకు జరిగే నష్టం ఏమిటి?
జవాబు:  మెమో.3307 ; ఆర్ధిక ; తేదీ:24.2.1993 ప్రకారం 18,24 ఇయర్స్ స్కేల్స్ ఇక ఇవ్వరు.ఇచ్చిన 12 ఇయర్స్ స్కేల్ మాత్రం కొనసాగుతుంది.



No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND