Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

గ్రాట్యూటీ (GRATUITY) అంటే ఏమిటి-వివరణ

గ్రాట్యూటీ (GRATUITY) అంటే ఏమిటి-వివరణ
ప్రభుత్వ ఉద్యోగి సుదీర్ఘకాలం ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందించి, పదవీ విరమణ చేసిన సందర్భంగా శేషజీవితం సంతోషంగా గడుపుటకు సదరు ఉద్యోగి సేవలకు గుర్తింపుగా కృతజ్ఞతాభావం (GRATITUDE) గా అందజేయు ఆర్ధిక సౌలభ్యాన్ని మనము గ్రాట్యూటీ (GRATUITY) గా పరిగణించవచ్చు. నియమ నిబంధనల మేరకు గ్రాట్యూటీ లెక్కించి,ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగికి మొత్తం చెల్లిస్తారు.ఒకవేళ సర్వీసులో ఉంటూ ఉద్యోగి మరణించిన యెడల, ఉద్యోగికి రావలసిన గ్రాట్యూటీ మొత్తం,అతని వారసులకు నియమ నిబంధనల మేరకు చెల్లిస్తారు.
   A.P.Revised Rules 1980 Rule 49 ప్రకారం ప్రతి ఉద్యోగి తన తదనంతరం గ్రాట్యూటి మొత్తం పొందుటకు ఒకరు గాని,అంతకు మించిగాని నామినీ ని నియమించవలసి ఉంది,అలాంటి సందర్భాలలో నియమించిన వ్యక్తులలో ఎవరికి ఎంత భాగము చెల్లించవలెనో తెలియజేయాల్సి ఉంటుంది.
    రూల్ 49(i)  ప్రకారం ఉద్యోగికి కుటుంబ సభ్యులు కలిగియున్న యెడల,కుటుంబ సభ్యులను తప్ప ఇతరులను నామినేట్ చేయకూడదు.
యాంటిసిపేటరీ గ్రాట్యూటీ:
    (Rule 51(c) of A.P.Revised Pension Rules-1980)
 ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్,పెన్షన్ ఆధారిత మొత్తాలు మంజూరు చేయు విషయంలో ఆలస్యం జరుగుతుండటం సర్వసాధారణం. ఉద్యోగికి రావల్సిన గ్రాట్యూటీ మొత్తంలో 80% వరకు సంబంధిత అధికారి మంజూరు చేయవచ్చు.కాని ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు అపరిష్కృతంగా ఉన్న యెడల యాంటిసిపేటరీ గ్రాట్యూటీ మంజూరుచేయు అవకాశం లేదు.
(G.O.Ms.No.275 F&P ,  Dt:27-7-1994) .
G.O.Ms.No.14 F&P తేది:30.1.1999 ద్వారా  గ్రాట్యూటీ రెండు  రకాలుగా లెక్కిస్తారు.
 మొదటి విధానం:
ఉద్యోగి పూర్తిచేసిన ప్రతి అర్ధ సంవత్సరానికి, అతను చివరగా పొందిన బేసిక్ పే ఆధారంగా, గరిష్ఠంగా 66 అర్ధ సంవత్సరాలకు వచ్చే మొత్తంపై నాల్గవ భాగం(1/4)
 రెండవ విధానం:
ఉద్యోగి చివరగా పొందిన బేసిక్ పే ఆధారంగా పదహారున్నర నెలల మొత్తం ఏది తక్కువైతే అది పొందవచ్చు.
కరువుభత్యo చెల్లిస్తారు.
RPS-2015 లో G.O.Ms.No.99 Fin తేది:21-7-2015 ప్రకారం గరిష్ఠంగా గ్రాట్యూటిని 12 లక్షలకు పెంచడం జరిగింది.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND