Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

JAGANANNA AMMAVODI - Rc.No.242 , Dated : 03/01/2020 - Latest Proceedings


ఏ ఏ కారణముకి ఏమి జత చేయాలో చూడండి.
1. Electricity: ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నవి. అవి
a) service no. వారికి సంబందించినదే కానీ అంత వాడకము లేదు: ఈ case లో ఆ service no. తో ఉన్నటువంటి చివరి 6 నెలల current బిల్లుల xerox లేదా AE గారి సంతకము గల నివేదిక కాని జత చేయాలి.
b) service no. వారికి సంబందించినదే కాదు: ఈ case లో service no. వీరి కుటుంబముకి చెందినది కాదు అని AE గారు certify చేసినది జత చేయాలి.
2. Ration Card లేదు: ఈ case లో లబ్దీదారుకి ration card లేదు అని ఆ గ్రామ VRO గారు certify చేసినది జత చేయాలి.
3. Student Aadhar లేదు: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.
4. Four wheeler: ఈ case లో చూపించబడిన number గల వాహనము వీరిది కాదు అని సంబందిత అధికారి (RTO/MVI) certify చేసినది లేదా online లోని నివేదిక తో పాటుగా self declaration జత చేయాలి.
5. Govt Employee/ Pensioner: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.
6. Land details: ఈ case లో గ్రామములో లబ్దీదారు కుటుంబమునకి wet land: ...….. (విస్తీర్ణము)dry land: ....... (విస్తీర్ణము) ఇంత ఉంది అని సంబందిత VRO గారు certify చేసినది, వారి కుటుంబ సభ్యుల భూమి వివరముల పట్టాదారు పుస్తకము xerox లు (భూమి ఉన్నవారికి మాత్లమే) మరియు మా కుటుంబములో వారికి ఈ గ్రామములలో (గ్రామముల పేర్లు రాయాలి) తప్ప మరెక్కడా భూములు లేవని self declaration. ఇవన్నీ జతచేయాలి.
➖➖➖➖➖➖➖
పాఠశాల విద్యాశాఖ కమీషనరు, ఆంధ్రప్రదేశ్ వారి కార్యావర్తనములు
ప్రస్తుతం శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, ఐ.ఎ.ఎస్.
ఆర్.సి.నెం. 242/ఎ&ఐ/2019, తేది : 03.01.2020
     విషయం:  పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు రూ. 15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట - 2019-20 విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై తదుపరి సూచనలు.
      నిర్దేశములు
1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ (ప్రోగ్రాం-II) వారి ఉత్తర్వులు నెం. 79, తేది : 4.11.2019
2. ఈ కార్యా లయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 16.11.2019
3. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 22.11.2019
4. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 2.12.2019
5. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 20.12.2019
6. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 31.12.2019
7. ఈ కార్యా లయపు కార్యా వర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 02.01.2020

ఆదేశములు:
1.    జగనన్న అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా అర్హులైన తల్లుల సంరక్షకుల జాబితాలు సిద్ధం చేసి 2-01-2020 నాడు జిల్లా విద్యాశాఖాధికారులకు ఉత్తర్వులు సూచిక 7 ద్వారా ఇవ్వడమైనది. మరియు 3-1-2020న టెలికాన్ఫరెన్స్ ద్వారా కమీషనరు, పాఠశాల విద్య సమగ్రమైన ఆదేశాలను జిల్లా విద్యాశాఖాధికారులకు మరియు ప్రాజెక్టు అధికారులు సమగ్రశిక్ష వారికి జారీ చేయడమైనది.
2.     అర్హులైన తల్లుల / సంరక్షకుల జాబితాలను జిల్లా విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాలకు మరియు గ్రామ/వార్డు సచివాలయాలకు 2-1-2020న
జాబితాలను పంపించారు. ఈ జాబితాలను పాఠశాలల వారీగా, గ్రామ/వార్డు సచివాలయాల వారీగా ప్రదర్శించాలి.
3.     పై జాబితాలో తల్లులు / సంరక్షకులు పేర్లు లేనివారు ఆందోళన చెందవద్దని, అటువంటి వారు వారి వివరాల ధృవీకరణ పత్రాలతో గ్రామ వార్డు సచివాలయాల దృష్టికి, ప్రధానోపాధ్యాయుల దృష్టికి మరియు మండల విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లయితే ఆ డేటాను పరిశీలించి వాస్తవాలను ప్రధానోపాధ్యాయులు/మండల విద్యాశాఖాధికారులు 5-1-2020 సాయంత్రం 5.00 గంటల లోపు అప్ డేట్ చేయవలెను.
4.      చాలా మంది తల్లులు / సంరక్షకులు వారికి సంబంధించిన భూ వివరాలు రెవెన్యూ వారి వెబ్ ల్యాండ్ లో నమోదయినది సరైనవి కాదని విజ్ఞప్తి చేస్తున్నారు. అటువంటి తల్లులు / సంరక్షకులు ఎవరైనా వారి ధృవీకరణ వివరాలతో గ్రామ/వార్డు సచివాలయాల దృష్టికి, ప్రధానోపాధ్యాయుల దృష్టికి మరియు మండల విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లయితే పరిశీలించి ఆ డేటాను ప్రధానోపాధ్యాయులు/మండల విద్యాశాఖాధికారులు 5-1-2020 సాయంత్రం 5.00 గంటల లోపు అప్ డేట్ చేయాలి.
5.       పై వివరాలన్నింటిని 5-1-2020 సాయంత్రం 5.00 గంటల లోపల అప్డేట్ చేయాలి.
6.       ఇంకా తల్లులు / సంరక్షకులు ఎవరైనా సకాలంలో ధృవీకరణ పత్రాలు అందచేయని యెడల వారు కూడా తరువాత రోజులలో వారి ధృవీకరణ పత్రాలను గ్రామ వార్డు సచివాలయాల దృష్టికి ప్రధానోపాధ్యాయుల దృష్టికి మరియు మండల విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లయితే వాటిని పరిశీలించిన పిదప వారు అర్హులైనచో వారిని కూడా లబ్ధిదారులుగా గుర్తించడం జరుగుతుంది.

Sd/-
కమీషనర్,
పాఠశాల విద్య (పూ.అ.బా)

రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులందరికీ
రాష్ట్రంలోని అందరు అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లకు
రాష్ట్ర స్థాయి పరిశీలకులకు
శ్రీ ఎ.సుబ్బారెడ్డి, సంయుక్త సంచాలకులు, పాఠశాల విద్య, (ప్రత్యేక అధికారి, అమ్మఒడి) ఇబ్రహీంపట్నం వారికి
ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎపిసిఎఫ్ఎస్ఎస్, ఇబ్రహీంపట్నం వారికి
కమిషనర్, ఇంటర్మీడియెట్ విద్య వారికి ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఎపి ఆన్ లైన్ వారికి

ఈ ఉత్తర్వుల ప్రతిని ఈ కింది వారికి సమర్పించడమైనది:
గౌరవనీయ ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోని అడిషనల్ చీఫ్ సెక్రటరి గారికి
పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, వెలగపూడి, అమరావతి
స్పెషల్ కమీషనరు, గ్రామ/వార్డు వాలంటీర్లు మరియు గ్రామ/వార్డు సచివాలయ శాఖ, కుంచనపల్లి గుంటూరు వారికి
రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు అందరికీ

గౌరవ విద్యాశాఖామాత్యుల కార్యాలయంలోని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ వారికి.

Download Rc.No.242 , Dated :03/01/2020.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND