Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

PONGAL (SANKRANTHI) HOLIDAYS : Prefix & Suffix

సంక్రాంతి సెలవులు : Prefix & Suffix పై వివరణ
PONGAL (SANKRANTHI ) HOLIDAYS  : Prefix & Suffix 
దసరా/సంక్రాంతి సెలవులు 9 రోజులు ప్రకటించినపుడు (ఆదివారంతో కలిపి) చివరి రోజు గానీ , బడి తెరిచే రోజు గానీ (రెండింటిలో ఒకటి మాత్రమే) సాధారణ సెలవు(CL) పెట్టుకోవచ్చు.
దసరా/సంక్రాంతి సెలవులు 10 నుంచి 14 రోజులు (ఆదివారంతో కలిపి) ప్రకటించినపుడు చివరి రోజూ, బడి తెరిచేరోజు (రెండు రోజులు) తప్పక బడికి వెళ్ళాలి.
అలా వెళ్లకపోతే... మొత్తం సెలవులకి అర్హత గల సెలవు పెట్టవలసి ఉంటుంది.
అనగా EL/MCL/HPL/EOL లలో ఏదోఒకటి పెట్టవలసి ఉంటుంది.
దసరా/సంక్రాంతి సెలవులు 15 లేక అంతకంటే ఎక్కువ రోజులు (ఆదివారంతో కలిపి) ప్రకటించినపుడు బడి చివరి రోజు గానీ , బడి తెరిచేరోజు గానీ (రెండింటి లో ఒక రోజు మాత్రమే) అర్హత గల సెలవు పెట్టుకోవచ్చు.
అర్హత గల సెలవు అనగా EL/HPL/MCL లలో ఒకటి 1 రోజు కోసం వాడుకోవచ్చు.
గమనిక :- ఈ సంవత్సరం సంక్రాంతి సెలవులు 10.01.2020 నుంచి 20.01.2020 వరకు అనగా మొత్తం 11 రోజులు. కావున 9వ తేదీ ( చివరి రోజు ) మరియు 21వ తేదీ ( బడి తెరిచే రోజు ) తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలి. ఈ రెండు రోజులలో ఏ ఒక్క రోజు హాజరుకాకపోయినచో ఈ 11 రోజులు అర్హతగల EL/HPL/MCL/EOL లలో ఏదోఒకటి పెట్టవలసి ఉంటుంది.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND