➧ సేవింగ్స్‌పై ప్రతికూల ప్రభావం
➧ ఆర్థిక నిపుణుల హెచ్చరికలు
Income tax - 2020-21
న్యూఢిల్లీ: మినహాయింపులు, తగ్గింపులు లేని కొత్త ఐచ్ఛిక పన్ను విధానం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ ప్రతిపాదన దేశంలో 'పొదుపు' (సేవింగ్స్)పై ప్రతికూల ప్రభావం చూపు తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో రెండు రకాల పన్ను విధానాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదివరకు ఉన్న పన్ను విధానంతో పాటు ఎలాంటి మినహాయింపు లూ లేని తక్కువ పన్ను శాతం కలిగిన రెండో విధానాన్ని తీసుకొ చ్చారు. అయితే, ఇది ఐచ్ఛికమనీ.. తమకు నచ్చిన పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చునని కేంద్రం పేర్కొంది.
అయితే, గత ఆరేండ్లుగా పొదుపులకు సంబంధించిన గణాంకాలను గమనిస్తే.. సేవింగ్స్ తగ్గుతూ వస్తున్నాయి. 2012లో దేశ సరాసరి సేవింగ్స్ రేటు 36 శాతం ఉండగా.. ప్రస్తుతం అది 30 శాతానికి తగ్గింది. మరోవైపు 80 శాతం మంది పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానంలోకి మారుతారని రెవెన్యూ శాఖ కార్యదర్శి అజరు భూషణ్ పాండే గతంలో అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.
దీనిపై ఎన్‌ఐపీఎఫ్‌పీ ప్రొఫెసర్ ఎన్‌ఆర్. భానుమూర్తి మాట్లాడుతూ.. దేశంలో అన్ని రంగాల్లో డిమాండ్ తగ్గడంతో ఆర్థిక మందగమనం సాగుతోందనీ, అయితే, డిమాండ్‌ను పెంచేందుకు కేంద్రం ప్రత్యక్ష పన్నులు (వ్యక్తిగత, కార్పొరేట్) తగ్గించిందని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో డిమాండ్ కొంతమేరకు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మినహాయింపులు లేని పన్ను విధానం వల్ల ప్రజల పొదుపుపై తీవ్ర ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర మాజీ మంత్రి యోగిందర్ అలాఫ్‌ు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. అదనపు పన్ను సేవింగ్స్ బాండ్స్ ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. సేవింగ్స్ రేటు తగ్గినప్పటికీ.. ప్రస్తుతం ఆర్థిక మందగమన పరిస్థితుల్లో ఇలాంటి పన్ను విధానం తప్పుకాదని జేఎన్‌యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రోహిత్ ఆజాద్ అన్నారు. అయితే, కొత్త పన్ను విధానంతో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు ఎలాంటి ప్రయోజనమూ ఉండబోదని చెప్పారు.కొత్త పన్ను ప్రతిపాదన ప్రకారం.. రూ. 2.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ .2.5 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఆదాయానికి పన్ను రేటు 5 శాతం ఉంటుంది. అలాగే, రూ.5 లక్షల నుండి రూ.7.5 లక్షల ఆదాయం ఉన్నవారు 10 శాతం, రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు 15 శాతం, రూ.10 లక్షల నుండి రూ.12.5 లక్షలలకు 20 శాతం, రూ.12.5 లక్షల నుండి 15 లక్షలకు 25 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.15 లక్షలు దాటితే 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

No comments:
Post a Comment