15 నుంచి ఆర్టీసీ సేవలు ?
ఆన్‌లైన్ రిజర్వేషన్ల ప్రారంభం
ఏసీ బస్సులు ఇప్పుడే కాదు..
లాక్‌డౌన్ ముగిసిన తర్వాత బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్ రిజర్వేషన్లను ప్రారంభించింది. ఈ నెల 14తో లాక్‌డౌన్ పూర్తి కానుండటంతో 15 నుంచి బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దూర ప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సులను తాత్కాలికంగా నడపకూడదని ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రస్తుతానికి సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు రిజర్వేషన్లను ఆరంభించామని అధికారులు తెలిపారు. వివిధ మార్గాల్లో జరిగే బుకింగ్ ఆధారంగా బస్సుల సంఖ్య పెంచడం, తగ్గించడంపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత దశలవారీగా ఏసీ బస్సులను నడుపుతామని, వాటిలోనూ 24-25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూస్తామని చెబుతున్నారు.

No comments:
Post a Comment