Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

కారుణ్య నియామకాలు

కారుణ్య నియామకాలు
మరణించిన ప్రభుత్వోద్యోగి యొక్క ఆధారితులకు జిఓ 687 జిఎడి, తేది03.10.1977 ద్వారా కారుణ్య నియామక సౌకర్యముకల్పించబడినది. కాలక్రమంలో దీనిపై పలు సవరణలు, వివరణలు ఇవ్వబడినవి. వాటన్నిటిని చేర్చి మెమో నం.60681/ సర్వీస్-ఎ/2003-1 జిఎడి తేది. 12.08.2003 ద్వారా సమగ్ర ఉత్తర్వులు యివ్వబడినవి.
➧వైద్య కారణములపై రిటైరైన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు జిఓ.ఎంఎస్.నం. 661 జిఏడి తేది.23.10.2008 ద్వారా పునరుద్ధరించ బడింది.
కారుణ్య నియామకాలకు అర్హులైన వారు : 1) మరణించిన లేక 2) గడిచిన 7 సం||ల పైగా కనిపించకుండా పోయిన లేక 3)వైద్య కారణముల పై రిటైర్మెంట్ కు మెడికల్ బోర్డు ఉద్యోగి వినతిని అప్రవ్ చేసిన తేదీ నుండి (జిఓ నం. 182; తేది. 22.06.2014) 5 సం||ల సర్వీసుగల ఉద్యోగి కుటుంబములో సంపాదనా పరులెవ్వరు లేనప్పుడు ఆ కుటుంబములో ఒకరు నియామకమునకు అర్హులు.  ఉద్యోగి కనిపించకుండా పోయిన సందర్భంలో పోలీసు రిపోర్టు ఆధారంగా, సంబంధిత ప్రభుత్వ శాఖ కార్యదర్శిఅనుమతితో కారుణ్య నియామకం ఇవ్వబడుతుంది.
సర్వీస్లో మరణించిన ఎయిడెడ్ టీచర్ల వారసులకు జిల్లా యూనిట్ గా కారుణ్య నియామకాలు జిఓ.ఎంఎస్.నం. 113
విద్య, తేది. 06, 10.2009 ద్వారా అనుమతించబడినవి.
ఆధారిత కుటుంబ సభ్యులు :
1) ఉద్యోగి భార్యలేక భర్త
2) కుమారుడు లేక కుమార్తె
3) ఉద్యోగి మరణించిన నాటికి 5సం||ల ముందు చట్టబద్ధంగా దత్తత తీసుకొనబడిన కుమారుడు లేక కుమార్తె
4) ఉద్యోగి భార్య / భర్త నియామకమునకు ఇష్టపడని సందర్భములో ఆ కుటుంబముపై ఆధారితురాలైన వివాహిత కుమార్తె
5) మరణించిన ఉద్యోగికి - ఒక వివాహితకుమార్తె, మరియొక మైనర్ కుమార్తె వున్న సందర్భములో వారి తల్లిచే సూచించబడిన ఒకరు
 6) ఉద్యోగి అవివాహితుడై మరణించినప్పుడు అతని తమ్ముడు లేక చెల్లెలు కారుణ్య నియామకమునకు అర్హులు. కారుణ్య నియామకము పొందిన తదుపరి పునర్వివాహం చేసుకొన్ననుఉద్యోగంలో  కొనసాగుతారుయుటిఎఫ్.
నియమించబడే పోస్టు స్థాయి : జూనియర్ అసిస్టెంట్  పోస్టునకుగాని, ఆ పోస్టు యొక్క స్కేలుకు మించని పోస్టుకుగాని, అంతకంటే తక్కువ స్థాయి పోస్టుకుగాని కారుణ్య నియామకము ఇవ్వబడును.
నియామకపు విధానము : సాధారణ నియామక విధానముతో సంబంధము లేకనే కారుణ్య నియామకములు చేయబడతాయి ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సంవత్సరంలోగా అతని కుటుంబ సభ్యుడు నియామకము కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి.
మైనర్ పిల్లలకు ఉద్యోగి మరణించిన 2 సంవత్సరములోగా 18 సంవత్సరముల వయస్సు నిండినప్పుడు మాత్రమే వారి దరఖాస్తు పరిగణించ బడుతుంది.
సాధారణ నియామకములపై విధించబడెడి నిషేధము యీ నియామకములకు వర్తించదు.వైద్య కారణములపై రిటైర్మెంట్ కోరుకొనే వారి దరఖాస్తు జిల్లా / రాష్ట్ర వైద్యుల కమిటీకి పంపి వారి నివేదిక ఆధారంగా
జిల్లా / రాష్ట్ర కమిటీ సిఫార్సు మేరకు నియామకాధికారి అనుమతిస్తారు.
అర్హతలు : 1) ఆయా పోస్టులకు సంబంధించిన నిర్ణీత విద్యార్హతలను కలిగి వుండాలి. అయితే జూనియర్ అసిస్టెంట్ గా
సబార్డినెట్ ఆఫీసులలో నియామక అర్హతైన ఇంటర్మీడియేట్ పాసగుటకు 3 సం||ల గడువు, శాఖాధిపతి కార్యాలయము లేక సచివాలయము అయినచో నియామక అర్హతైన డిగ్రీ పాసగుటకు 5 సం॥ల గడువు అనుమతించబడుతుంది. గడువులోగా కావలసిన అర్హత వర్తిస్తుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బిసి తరగతులకు చెందినవారికి 5 సం||ల మినహాయింపు వున్నది. ఉద్యోగి భార్య / భర్తకు కారుణ్య నియామకము ఇవ్వవలసిన సందర్భములో గరిష్ట వయోపరిమితి 45 సం||లు చివరి శ్రేణి పోస్టులకు వయస్సు, అర్హతలు తగిన విధంగా లేనప్పుడు ముందు నియామకమును యిచ్చి ఆ తదుపరి మినహాయింపును సంబంధిత శాఖ నుండి పొందవచ్చును.
నియామక పరిధి : మరణించిన ఉద్యోగి పనిచేసిన యూనిట్ లో నియామకము ఇవ్వబడుతుంది. ఆ యూనిట్ లో ➧ఖాళీ లేనప్పుడు ఆ కేసులను నోడల్ అధికారియైన జిల్లా కలెక్టరుకు పంపినచో వారు ఇతర ఏ డిపార్టుమెంట్లకైనను కేటాయించెదరు.
➧ఏ డిపార్టుమెంటులోను, ఖాళీలు లేని సందర్భములో కలెక్టరు ఒక క్యాలెండరు సంవత్సరంలో 5 వరకు సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించవచ్చును. అంతకుమించి పోస్టులు అవసరమయినప్పుడు సంబంధిత శాఖకు ప్రతిపాదనలు పంపబడతాయి.
➧ఈ కారుణ్య నియమకాలు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటాలో సిక్స్ పాయింట్ ఫార్ములాకు లోబడి యివ్వబడతాయి. అట్లే రిజర్వేషన్ని బంధన (రూలు 22)ను పాటించవలసి వుంటుంది. మరణించిన ఉద్యోగి భార్య కారుణ్య నియామమునకు దరఖాస్తు చేస్తే ఆమె స్వంత జిల్లాలోగాని, భర్త ఉద్యోగము చేసిన చోటగాని, ఏ ఇతర జిల్లాలో గాని నియామకాన్ని కోరుకోవచ్చు.
ఎక్స్ గ్రేషియా చెల్లింపు : కారుణ్య నియామకమయి ఇచ్చుట సాధ్యపడని సందర్భంలో నాలుగవ తరగతి ఉద్యోగుల
కుటుంబములకు రూ. 5,00,000/- నాన్-గజిటెడ్ వారికి రూ. 8,00,000/- గజిటెడ్ వారికి రూ. 10,00,000/-
ఎక్స్ గ్రేషియో చెల్లించబడుతుంది. (జిఓ ఎంఎస్ నం.114 జీఏడి; తేది. 21.08.2017)

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND