పాత పింఛను విధానం పునరుద్ధరించాలి :ప్రధానికి ఎన్‌ఎఫ్‌ఐఆర్ లేఖ...
కొత్త పింఛను విధానాన్ని రద్దుచేసి, పాత పద్ధతినే పునరుద్ధరించాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమన్(ఎన్‌ఎఫ్‌ఐఆర్) ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇటీవల లేఖ రాసింది. ‘‘ఇతర శాఖలతో పోలిస్తే రైల్వే ఉద్యోగుల విధి నిర్వహణ అత్యంత కఠిన పరిస్థితుల్లో ఉంటుంది. భద్రత నిర్వహణలో రోజుకు ఇద్దరు చొప్పున కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. రైల్వే ఉద్యోగులకు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించే డిమాండ్‌ను అప్పటి రైల్వే మంత్రులు సురేష్ ప్రభు, మల్లిఖార్జున్ ఖర్గె అంగీకరించారు’’ అంటూ ఎన్‌ఎఫ్‌ఐఆర్ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య ప్రధానికి రాసిన లేఖలో వివరించారు.
ఆయన ఒక ఉదాహరణను ప్రస్తావిస్తూ ‘అతనో రైల్వే ఉద్యోగి. మార్చి 18న ఆయన పింఛను ఖాతాలో రూ.20.90 లక్షలున్నాయి. 26వ తేదీ నాటికి అది రూ.20.36 లక్షలకు తగ్గింది. 8 రోజుల్లోనే ఆయన పింఛను నిధి రూ.56 వేలు తగ్గింది. కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్లు పడిపోతుండగా, ఆ ప్రభావం పింఛను నిధిపై, తద్వారా పదవీ విరమణ తర్వాత వచ్చే పింఛనుపై పడుతోందని రైల్వే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు’’ అని వివరించారు.

No comments:
Post a Comment