Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

FUNCTIONAL ENGLISH

FUNCTIONAL ENGLISH

FUNCTIONAL ENGLISH-4

Pardon/ Beg your pardon
Santan: May I know where you are from?
(మీరెక్కడివారో తెలుసుకోవచ్చా?)
Dushyanth: Oh, sure. I am from Nizamabad.
(మాది నిజామాబాద్)
Santan: Pardon?
(వినపడలేదు. మళ్లీ చెప్పండి)
Dushyanth: I said Nizamabad.
 (నిజామాబాద్ అని చెప్పాను) 
Santan: Where exactly do you live in Nizamabad. I have a few friends there.
(నిజామాబాద్‌లో ఎక్కడ? నా స్నేహితులు కొంతమంది ఉన్నారక్కడ)
Dushyanth: Very close to the bus stand. Prasanthi Apartments, 402. 
 (బస్టాండ్‌కు దగ్గరలోనే ప్రశాంతి అపార్ట్‌మెంట్స్, 402)
Santan: Prasanna Apartments did you say?
(ప్రసన్న అపార్ట్‌మెంట్స్ అన్నారా?)
Dushyanth: No, it is Prasanthi Apartments.
(కాదు, ప్రశాంతి అపార్ట్‌మెంట్స్)
పై సంభాషణ గమనించారు కదా? అవతలి వాళ్లు చెప్పింది మనకు సరిగా వినపడకపోతే మళ్లీ చెప్పండి అనేందుకు, Pardon/ Beg your pardon/ Pardon please అంటాం. Pardon = క్షమించండి. (వినపడలేదు) అని అర్థం. 
ముఖ్యంగా మనకు పరిచయంలేనివాళ్లు, మనకంటే పెద్దవాళ్లు, మనకంటే పై స్థాయిలో ఉండేవాళ్లు చెప్పింది మనకు వినపడకపోతే, మళ్లీ చెప్పమనేందుకు, Pardon/ Beg your pardon/ Pardon please అనాలి. అలా అనడం మర్యాదకర ప్రవర్తన (Polite behavior). Pardon అలవాటు చేసుకోండి.
Rahim: (Over Phone) Hello, is it, Mr. Johnson, please.
(హలో, జాన్సన్ గారేనాండి?)
Johnson: Yes it is, and who is this, please?
(అవును. మీరెవరండీ?)
Rahim: I am Rahim, Mr. Johnson.
Johnson: Yes, Mr. Rahim, What can I do for you?
(చెప్పండి రహీంగారూ, ఏం కావాలి?)
Rahim: Could you give me the phone no. of your friend Jagdeesh?
(మీ ఫ్రెండ్ జగదీష్ ఫోన్ నెంబర్ ఇస్తారా?)
Johnson: Oh, sure. Here it is 9440035545.
Rahim: Sorry, I couldn't get you. Could you repeat it, please?
Johnson: 9-4-4-0-0-3-5-5-4-5. Is it ok?
(9440035545, సరేనా?).
Rahim: Oh, Thank you. Sorry for troubling you/ sorry for the trouble.
 చూడండి. అవతలివాళ్లు చెప్పింది మనకు సరిగా వినపడక, మళ్లీ చెప్పమనడానికి ఇలా కూడా అనవచ్చు.
a) Sorry, I couldn't get you. Could you repeat it, please?
b) Sorry, I'm afraid I couldn't hear you. Once again, please.
c) Could you repeat it/ Could you repeat yourself, please?
      ఇవన్నీ కూడా Polite behaviour (మర్యాదకర ప్రవర్తన) ను సూచిస్తాయి. నిత్యజీవితంలో ఇవి వాడాల్సిన సందర్భాలు చాలానే ఉంటాయి. Practice చేయండి. 

*Could you*
Sukrita: Could you please lend me your pen?
(మీ పెన్ ఓసారి ఇవ్వగలరా?)
Sunanda: By all means, here you are.
(తప్పకుండా, ఇదిగోండి)
Sukrita: Thank you.
Sunanda: It's all right.
        పైన గమనించండి: 'Could' వాడకం. ఇది Politest form of request.
అంటే ఇతరుల నుంచి ఏదైనా కావాలనుకుంటే అతి మర్యాదగా అడిగే విధానం.  ముఖ్యంగా మనకు పరిచయంలేని వ్యక్తులను, మనకంటే పెద్దవాళ్లనూ, మన స్థాయి కంటే పైన ఉన్న వాళ్లను request చేసేందుకు వాడే పదమన్నమాట. ఈ ఉదాహరణ కూడా చూడండి.  
Ram: Excuse me, could I have a glass of water, please?
(నాకు ఒక గ్లాసు నీళ్లు ఇవ్వగలరా?)
Laxman: Oh, certainly. would you have it cool or normal?
(తప్పకుండా, బాగా చల్లటి నీళ్లు కావాలా, మామూలు నీళ్లు కావాలా?)
Ram: I'd rather have it cool.
(నాకు చల్లనీళ్లే కావాలి)
Laxman: Have it
Ram: Thank you
Laxman: You're welcome.
Could ను request కు వాడినప్పుడు response (స్పందన) చూడండి.
By all means = తప్పకుండా/ Oh, certainly/ Oh, sure
వీటన్నిటికీ అర్థం తప్పకుండా అని.
Look at the following.
Suman: Could you let me use your phone?
(మీ Phone వాడొచ్చా?)
Sunil: I am afraid, no. (లేదండీ)  
మీ Phone వాడొచ్చా? అని అడిగినప్పుడు, వీల్లేదని మర్యాదగా చెప్పేందుకు వాడే expression 'I'm afraid, no'.
ఇక్కడ afraid కు అర్థం, భయం అని కాదు. 'sorry' అని. ఇది తరచూ వచ్చే పదం.   
➖➖➖➖➖➖➖➖➖
FUNCTIONAL ENGLISH-3
May I know what you are ?
మనం కలుసుకున్నవాళ్లు, మన పరిచయస్తులు ఎక్కడుంటారు ? ఏం చేస్తుంటారు ? (ఉద్యోగం ఏమిటి  ?) లాంటి వివరాలను ఎలా తెలుసుకుంటామో ఇప్పుడు చూద్దాం.
Pavithra: Where did you say you're (You are) from ? (మీదేవూరన్నారు మీరు ?)
Pankaja: I come from Vizag, I told you; but I've (I have) been here for quite a long time. I can almost say that I am from Hyderabad.
(మాది Vizag అని చెప్పాను. కానీ నేనిక్కడ చాలాకాలంగా ఉన్నాను. కాబట్టి మాది హైదరాబాద్ అనే చెప్పొచ్చు.)
Pavithra:  May I Know what you are ?
(మీరేం చేస్తుంటారు ?)  
Pankaja: I teach in a high school. I've been a teacher for seven years now. What do you do for a job ?
(నేను school teacher ను. ఏడేళ్లుగా school teacher గా ఉన్నాను. మీరేం చేస్తుంటారు ?)
Pavithra: Just a homemaker. I've (I have) a school-going son and an infant daughter. I've (I have) my handsful looking after the two.
(నేను ఇల్లాలినే. School కు వెళ్లే కొడుకూ, చంటిపాప ఉన్నారు నాకు. ఆ ఇద్దరినీ చూసుకునేందుకే సరిపోతుంది నాకు.)
Pankaja: What's your husband, if I may know.
(మీ భర్త ఏం చేస్తారు ? అడగటం తప్పుకాకపోతే).
Pavithra: Oh by all means. He is an Engineer in Govt. service. (తప్పేముంది ? ఆయన ప్రభుత్వ ఇంజినీర్). 
గమనించారు కదా ?
a) What are you? = మీదేం ఉద్యోగం ?
b) May I know what you are? = మీరేం చేస్తుంటారో తెలుసుకోవచ్చా?
c) What do you do for a job ?/ a living ? = (ఇది కూడా) మీ ఉద్యోగం ఏంటి?
Where are you working ? అని కూడా అనవచ్చు.
Narmada: Where do you live ? (మీరెక్కడుంటారు ?)
Sourabha: (I live) in Jeedimetla. What about you ? (నేను జీడిమెట్లలో ఉంటా ? మీ సంగతేంటి ?)
Narmada: Gandhi Nagar.
Sourabha:  Your son doing B.Tech. He lives in the hostel, doesn't he ?
(B. Tech చేసే మీ అబ్బాయి, హాస్టల్‌లో ఉంటాడు కదా ?)
Narmada: He hasn't yet moved into the hostel. He will be, soon. Right now he is living in my cousin's house.
(ఇంకా hostel కు వెళ్లలేదు. త్వరలో వెళతాడు. ప్రస్తుతం మా cousin ఇంట్లో ఉంటున్నాడు.  
గమనిక: Cousin = ఒకే తల్లిదండ్రుల సంతానం కాకుండా, తల్లి/తండ్రి యొక్క సోదరుడు/ సోదరిల బిడ్డలు. మేనత్త, మేనమామల పిల్లలు కూడా cousins.
English లో brother/ sister, ఒకే తల్లికి పుట్టిన బిడ్డలకు మాత్రమే వాడతాం. ఇల్లు మారడం, English లో 'shift'' కాదు,  move. He moved (shifted కాదు) to the new house yesterday.)
1) What are you ? = మీ ఉద్యోగం ఏమిటి ?/ మీరేం చేస్తుంటారు ?
(What are you doing ? = మీరిప్పుడేంచేస్తున్నారు? మీదేం ఉద్యోగం? అనే అర్థం ఇక్కడ రాదు.)
What's (What is) your father? మీ నాన్నగారేం చేస్తారు? (ఆయన ఉద్యోగం ఏమిటి ?)
కొత్తవాళ్ల ఉద్యోగం అడిగేటప్పుడు, మర్యాదగా, 'May I know what you are? (మీ ఉద్యోగం ఏంటో తెలుసుకోవచ్చా?) అంటాం. ఇంకా...What do you do for a job ? అని కూడా అనవచ్చు.
2) మీరెక్కడుంటారు ?/ మీ ఇల్లెక్కడ ? = Where do you live ?/ Where's (Where is) your home/ place ?
(Where do you stay? అని కొంతమంది అంటుంటారు. అయితే ఇది సరికాదు. Stay = బస (ఏదో రెండు మూడు రోజులు మన ఊరుకానిఊర్లో తాత్కాలికంగా ఉండటం మాత్రమే. నివసించడం కాదు)
Chandana: Where do you live?
(నువ్వెక్కడుంటావు?)
Vandana: Next to the Post Office in Governorpet.
 (గవర్నరుపేట పోస్టాఫీస్ పక్కన)
(Am living/ is living/ are living సామాన్యంగా ఎక్కడన్నా మనం నివసించే అర్థంతో వాడతాం.)
For the present
I am living with my cousin. Soon I am moving to a house near my office.
(ప్రస్తుతానికి నేను మా cousin తో ఉంటున్నాను. త్వరలో మా Office కు దగ్గరగా ఉండే ఇంట్లోకి మారతాను.)
How kind of you !
It is good manners to express your appreciation for the help you get from others. The usual way of doing it is to thank the person who has helped you. Look at the following conversation.
(మనం ఇతరుల నుంచి సహాయం పొందినందుకు కృతజ్ఞతలు తెలపడం చాలా అవసరమని అందరికీ తెలుసు. Thanks, చెప్పడం ద్వారా కృతజ్ఞత తెలియజేస్తాం. అయితే thanks (ధన్యవాదాలు) చెప్పినందుకు మళ్లీ ఎలా స్పందించాలనేది కూడా ముఖ్యమే. 
a) Sravanthi: How kind of you, Akshaya! If you hadn't lent me your books, I couldn't have done so well in the exams. Thank you.
(అక్షయా! ఎంత సాయం చేశావు నువ్వు! నీ పుస్తకాలు నాకివ్వకపోయుంటే పరీక్షల్లో బాగా రాసే దాన్నికాదు. Thank you) 
Akshaya: No problem. Don't say that.
 (అదేమంత పెద్ద విషయం కాదులే. అలా అనకు)
గమనించారు కదా! Direct గా Thank you అనకుండా, How kind of you! / that's very kind of you!
(నువ్వు ఎంతో సాయం చేశావు అనే అర్థంతో వాడతాం, 'kind' ఇక్కడ 'దయగల' అనే అర్థంతో కాదు) అంటే - ఇది Thank you కంటే ఎక్కువ. దీనికి స్పందన No problem/ Please don't mention.
(అదేమంత పెద్ద విషయం కాదు. మీరంతగా చెప్పనవసరం లేదు)
b) Sravan: Could you give me a lift up to my home, please?
(కాస్త మాఇంటి వరకు నీ వాహనం మీద తీసుకెళతావా?)
Varun: Oh! with pleasure. (సంతోషంగా)
Sravan: Thanks a lot.
Varun: That's all right. (ఏం పరవాలేదు)

c) Pradhan: I've (have) been able to finish my work on time. I couldn't have done it without your help.
(సకాలానికి పనిపూర్తి చేయగలిగాను. నీ సాయంలేకపోయుంటే చేయగలిగేవాడిని కాను.)
Vuha: Oh, it's my pleasure (అది నా సంతోషం/ నా సంతోషం కొద్దీ చేశాను) 
d) Sneha: Please give me your pen.
Nethra: Here you are (ఇదిగో, తీసుకో)
Sneha: Thanks.
Nethra: It's ok.
e) Santosh: This is the road to the museum, isn't it ? (మ్యూజియం వెళ్లే రోడ్ ఇదే కదా ?)
Vinay: Yes, it is. (అవును)
Santosh: Thankyou
Vinay: You're (are) welcome/ It's a pleasure

f) Prasad: Thank you for the delicious dinner (పసందైన విందుకు చాలా Thanks)
Sukumar: Not at all. We enjoyed having you too. (ఏం ఫరవాలేదు. మీరు రావడం మాకానందం)
g) Bhoomika: Many happy returns of the day. Here's your birthday gift.
(నువ్విలాగే చాలా పుట్టిన రోజులు జరుపుకోవాలి. ఇదిగో నీకు కానుక.)
Chandrika: Oh, how lovely! Thank you very much. (ఎంత బావుందో! చాలా thanks)
Bhoomika: Oh, it's my pleasure/ It's OK. 
(అది నా ఆనందం/ ఏం పరవాలేదు)
ఇలా పలు సందర్భాలకు, రకరకాల స్పందనలున్నప్పటికీ, అన్నింటి కంటే ఎక్కువగా వినపడే స్పందన:
a) You are welcome.
b) It's all right
         and
c) It's my pleasure.
You're welcome బదులు welcome అని కూడా అనవచ్చు.
➖➖➖➖➖➖➖➖➖➖➖
FUNCTIONAL ENGLISH -2
Who do I see here ?
   మన స్నేహితులను, పరిచయం ఉన్నవాళ్లను, తెలిసినవాళ్లనూ కలుసుకున్నప్పుడు ఎలా పలకరించాలో చూద్దాం.
     (మర్చిపోకండి - practice is important)
Pradeep: Hi Jagdish, how are you ?
(ఎలా ఉన్నావు?)
Jagdish: Fine, Pradeep. Thank you. How are you?/ How about you ? 
(బాగానే ఉన్నాను. Thank you. నువ్వెలా ఉన్నావు?/ నీ సంగతేంటి?) ఇంకా ఇలా కూడా అనవచ్చు.
Anjana: Hi Sujee, how goes life?/ How's life? (ఎలా ఉన్నావు?)
Students అయితే, How are your studies?/ How about your studies?
(నీ చదువెలా ఉంది?/ నీ చదువెలా సాగుతోంది?)
Sujee: Fine. Thanks. How about you?/ How are your studies?/ How about your studies?
 (బాగానే ఉంది. Thanks. నీ సంగతేంటి?/ నీ చదువెలా ఉంది?)
Anjana: Fine too/ Same here/ Thank you.
 (బాగానే ఉంది/ నాదీ అంతే. Thank you.)
పరిచయస్తులను కలుసుకున్నప్పుడు ఇంకా ఇలా కూడా పరామర్శించుకోవచ్చు.
Subodh: Hi Pranav, how are you?
Pranav: Fine/ OK. (బాగానే ఉన్నా) . Can't complain (ఏ బాధాలేదు)/ No regrets (చింత పడాల్సిందేం లేదు. అంతా బాగానే ఉంది)/ Never better (ఇంతకంటే బాగా ఎప్పుడూలేను). Thank you. What about you ? (నీ సంగతేంటీ?)
Subodh: Same here.
(నా సంగతి అంతే.) Thanks
ఇంకా ఇవి కూడా చూడండి.
Pranav: Hi Subodh, How are you and how is everybody ? (ఎలా ఉన్నావు. మనవాళ్లంతా బాగున్నారా ?)/
How are you getting on ? (ఎలా గడుస్తోంది?)/ How are things going ? (విషయాలెలా జరుగుతున్నాయి?)/
How's (How is) life? (జీవితం ఎలా ఉంది?)
Subodh: Everybody/ everything is fine/ very well.
ప్రత్యేకంగా ఎవరిని గురించయినా అడిగేటప్పుడు:
How are/ How about your parents ?/ your brother (s) and sister (s)/ your kids (పిల్లలు)/ your parents ?/ How is your wife? etc.
చాలా కాలం తర్వాత మన సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, పరిచయస్తులను కలుసుకున్నప్పుడు,
Susmitha: Hi Neeraja, long since We met/ ages (యుగాలు) since we met/ long time, no see (చాలా కాలం మనం కలు సుకోలేదు); Where have you been all these days ? (ఇన్ని రోజులూ ఎక్కడున్నావు ?); is everybody OK ? (అందరూ కులాసానా ?)
Neeraja: It's a real pleasure meeting you after such a long time/ How nice meeting you after all these days! How goes life?
(ఇంతకాలం తర్వాత కలుసుకోవడం ఎంత సంతోషంగా ఉందో! జీవితం ఎలా గడుస్తోంది?)
ఇంకా ఉద్వేగంతో పలకరించాలనుకుంటే ఇలా కూడా అనవచ్చు, చాలాకాలం తర్వాత కలుసుకున్నప్పుడు.
Sritej: Hei, Who do I see here ? Srikar ?
(హెయ్, ఎవరిక్కడ కనపడుతున్నది నాకు ? శ్రీకరేనా ?)
What a Surprise !(ఎంత ఆశ్చర్యం ! Hope I am not mistaken (నేను పొరపడటంలేదు కదా ?)
(ఇవన్నీ మన ఆశ్చర్యం తెలిపేందుకు అంటాం)
Srikar: Make no mistake. I am Srikar of course. Enough.
(నువ్వేం పొరపడలేదు. నేను శ్రీకర్నేలే. ఇంక ఆపు.)
Where do you come from ?
వ్యావహారికంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మన భాష ఎంతో సరళంగా, సహజంగా ఉండాలి. ఒక్కోసారి మాట్లాడేటప్పుడు వాక్యం పూర్తవకపోవచ్చు కూడా. అలాంటప్పుడు clipped sentences కూడా వాడుతుంటాం. వీటిని మనం బాగా Practice చేయాలి. మననిత్య జీవితంలో ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మాట్లాడేస్తూ ఉండాలి. అలాచేస్తే కొద్ది రోజులకు అప్రయత్నంగానే కరెక్ట్‌గా మాట్లాడేస్తాం.
కొన్ని సందర్భాల్లో కొత్త వ్యక్తులు/ పరిచయస్తుల వివరాలు తెలుసుకుంటుంటాం. అలాంటివి కొన్ని ఇప్పుడు చూద్దాం.
మనకు పరిచయమైనవాళ్లు ఎక్కడి వాళ్లు ? ఏ భాష మాట్లాడతారు ? వృత్తి ఏమిటి ? ఇలాంటి వివరాలు తెలుసుకునే సందార్భాలు చాలా ఎదురవుతుంటాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.
Shahid: Hi Arshad, how are you ?
(ఎలా ఉన్నావు ?)
Arshad: Fine, how about you ?
(కులాసానే, మరి నువ్వు ?)
Shahid: Fine too, thank you.
(కులాసానే)
Arshad: How is your hostel life going ?
(హాస్టల్ జీవితం ఎలా ఉంది ?)
Shahid: Ok, though I can't say everything is all right, for one thing, the food can't be as good as home food, you know.
(బాగానే ఉంది. మొత్తం అంతా బాగుంది అనలేననుకో. ఒక విషయం, భోజనం ఇంటి భోజనంలా ఉండదు కదా ?)
Arshad: I can see that. Where are you from?
(అది అర్థం చేసుకోగలను. మీ ఊరేది?)
Shahid: We are from Vissannapeta. We own some property there. Dad is a professor at a Vijayawada College.
(మాది విస్సన్నపేట. మాకేదో కొంత ఆస్తి ఉందక్కడ. మానాన్న విజయవాడ కాలేజీలో ప్రొఫెసర్)
Where do you come from ?
(మీదే ఊరు ?)
Arshad: We belong here/ we are of this place.
(మేమిక్కడ వాళ్లమే)
Belong = చెందటం.
చూశారు కదా? Where are you from?/ where do you come from?
(మీదే ఊరు?/ మీరెక్కడి వాళ్లు?)
కొంచెం తెలీని వాళ్లనయితే,
May I know where you are from ? అంటాం. 
అలాగే I am from AP/ I come from AP. (మాది ఆంధ్రప్రదేశ్/ మేం ఆంధ్రప్రదేశ్ వాళ్లం.)
Where do you come from ?
(మీరెక్కడివాళ్లు ? అంతేకానీ మీరెక్కడి నుంచి వస్తారు ?/ వస్తున్నారు అనికాదు)
I am from/ I come from Nellore = మాది నెల్లూరు. (అంతేకానీ, నేను నెల్లూరు నుంచి వస్తున్నానని కాదు)
తేడా గమనించండి:
Where do you come from ? = మీదే ఊరు ?
Where are you coming from ? = మీరెక్కడ్నించి వస్తున్నారు (ఇప్పుడు)
ఈ ప్రశ్నల స్పందనలో తేడా గమనించండి.
1. Where are you/ do you come from?
(మీదే ఊరు?/ మీరెక్కడి వాళ్లు?)
A. I am from Ongole/ AP/ Nizamabad, (మా ఊరు ఒంగోలు/ మాది AP/ మా ఊరు నిజామాబాద్, etc)
2. Where are you coming from? (మీరెక్కడ్నించి వస్తున్నారిప్పుడు?)
A. (I am coming) from home/ college/ the cinema, etc.
(నేను ఇల్లు/ కాలేజ్  / సినిమా నుంచి వస్తున్నా.)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
FUNCTIONAL ENGLISH-1

GREETINGS
    పుస్తకాల్లో మనం చదివే English కూ, సంభాషణల్లో, నిత్య జీవితంలో మామూలు వ్యక్తులతో (పరిచయం ఉన్న/ లేని) సంభాషించేటప్పుడు వాడే English కు చాలా తేడా ఉంటుంది. తెలుగు కూడా అంతే కదా?
   గ్రంథాల్లో కనిపించే తెలుగుకు, మామూలుగా సంభాషించేటప్పుడు వాడే తెలుగుకూ తేడా ఉంటుంది కదా? సంభాషణకు వాడే English (Spoken English) చాలా సరళం (Simple)గా, సూటి (direct) గా ఉంటుందని మనకు తెలుసు.
   కానీ, మనలో చాలామంది ఇలాంటి English మాట్లాడలేరు. మనకు English లో సంభాషించే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి. అయితే అలాంటి English చాలా అవసరం. ఇది చాలా సందర్భాల్లో ఎలా వాడతారనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పలకరింపులు (Greetings)
ఇవి రెండు రకాలు:
1) Formal   
2) Informal.
● మనకంతగా పరిచయంలేని వాళ్లను, కొత్తవాళ్లను, మన పై అధికారులను, మనం చాలా గౌరవించే వాళ్లను పలకరించే తీరు - Formal.
● మనతో బాగా చనువున్న వాళ్లను, బంధువులను, మన కుటుంబంలోని వాళ్లనూ పలకరించే తీరు - Informal .
ఇవి గుర్తుంచుకుందాం.
Informal Greetings:
బాగా పరిచయం ఉన్న వాళ్లను పలకరించే విధానం: Hello
Kumar: Hello Rajesh, What are you doing?
Hello కు సమాధానం/ స్పందన Hello నే.
Rajesh: Hello Kumar, I'm (I am) on my way to college.
American Englishఅయితే, 'Hi' (హై) అందుకు స్పందన కూడా'Hi' నే.
Ramesh: Hi Naresh, How are you?
Naresh: Hi Ramesh, I'm fine. Thank you. How are you?.
Ramesh: Fine too. Thank you.
      ఇవి తెలిసినవే కదా ! మనం ఎవరినయినా మధ్యాహ్నం లోపు కలుసుకుంటే Good Morning, మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు అయితే Good Afternoon, సాయంత్రం నుంచి రాత్రి చివరిగా కలుసుకునే వరకు Good Evening , రాత్రి సెలవు తీసుకునేటప్పుడు Good Night అంటాం.
సంభాషణ పూర్తయ్యాక, Bye/ Good bye/ bye bye/ Have a nice day అనడం బాగుంటుంది.
Formal greeting:
a)  మనకు తెలిసిన వాళ్లను, పాత మిత్రులనూ కలుసుకున్నప్పుడు పలకరించే విధం.
Priya: Hi Madhavi, How are you ?
Madhavi: Fine, thank you; How are you ?/ and you? / How about you?/ what about you ?
(కులాసానే. Thank you. నువ్వెలా ఉన్నావు?/ నువ్వు/ నీ సంగతేంటి?) OK/ All right.
Priya: Fine too. Thank you. (కులాసానే. Thanks)/ OK too/ Same here, thank you.
b) మన స్నేహితుల యోగక్షేమాలను విచారించడం.
Karim: How are you ? How's everybody at home ? (ఎలా ఉన్నావు ? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు ?) / How are your parents ?/ How are the children ? (your children అనం) How are your brother and sister ?
Kiran: Everybody's OK. Thank you. How is it ?.
(అందరూ కులాసా. Thank you. నీ సంగతేంటి?-)  ఇలా కూడా అనవచ్చు.
Mukesh: Hi Suman, How are you getting on? How's (How is) everybody getting on at home?
(నువ్వెలా ఉన్నావు?/ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు?)
Suman: Quiet all right/ fine/ Thankyou. What about you?
Mukesh: Fine too/ Ok too/ All right too, Thank you.
Introductions
1) మనం మనల్ని ఇతరులకు ఎలా పరిచయం చేసుకోవాలో,
2) మనం, మనకు తెలిసినవాళ్లను ఒకరికొకరిని ఎలా పరిచయం చేయాలో చూద్దాం.
(ఇవన్నీ కూడా మనం నిత్యజీవితం (real life situations) లో practise చేస్తేనే బాగా అలవాటై సహజంగా అప్రయత్నంగా మనం మాట్లాడేస్తుంటాం. కాబట్టి అవకాశం వచ్చినప్పుడల్లా practise చేద్దాం.
I. Self introduction (స్వపరిచయం):
a) Formal (పూర్తిగా కొత్తవాళ్లతో/ పై అధికారులతో/ మనం వ్యవహారం నడపబోయేవాళ్లతో)
  'Excuse me, I am Narayana, May I know/ have your name please? (My name is అనవచ్చు. అయితే అంతకంటే 'I am....'  అనడం మెరుగు - ఇలా అనేటప్పుడు ఆత్మవిశ్వాసంతో, స్పష్టంగా, నిదానంగా, మర్యాదగా, మొదటిమాట ఎంత clear గా ఉంటుందో చివరిమాట కూడా అంత clear గా ఉండేలా మాట్లాడటం practise చేయండి) .
అవతలివాళ్లు మనం అనుకున్న వాళ్లేమో అనే సందేహం ఉన్నప్పుడు ఇలా అంటాం:
  Excuse me. I am Narayana. Am I (by any chance అని ప్రారంభించవచ్చు) speaking to Mr/ Sri Raghav? (మీరు రాఘవ్‌గారాండి?)
ఇలాంటి పరిస్థితిలో (ఇంకెవరైనా తమను తాము పరిచయం చేసుకున్నప్పుడు) మన స్పందన.
1) I am Achyuth. What can I do for you? (నాతో ఏమన్నా పనుందా)
2) Yes, I am (Am I speaking to Raghav? అని ఎవరన్నా అడిగితే).  Anything I can do for you? (నాతో పనేమన్నా ఉందా?).
b) Informal: (మనతో సమానమైన వాళ్ళతో) I am Srinivas, Your name please?
దీనికి స్పందన:
I am Anand. What's the matter? (నేను ఆనంద్/నాపేరు ఆనంద్ ఏంటి సంగతి? మర్యాద ధ్వనించేలా/ (What can I do for you?
(గమనిక: Myself Srinivas అని మాత్రం అనకూడదు. ఎప్పుడూ My name is/ అంతకంటే మెరుగ్గా I am Srinivas అనడం సరి. )
II. Introducing two of our friends to each other (మన స్నేహితులనిద్దరిని ఒకరినొకరికి పరిచయం చేయడం:
You are introducing Jagdish to Satish.
a) You (మీరు): Hi Satish, This (he అనకండి) is my classmate Jagdish and.....
Satish: Hi Jagdish, how do you do?/ Glad to meet you/ Pleased to meet you/ (so) nice to meet you./ Happy to meet you.
(గమనిక: How do you do కు స్పందన How do you doనే. I am fine లాంటివి అనం. 'How do you do ?' formal. మిగతావన్నీ informal).
You: Jagdish, this is, Satish, my playmate/neighbour, etc.
Jagdish: Hi Satish, How do you do?/ Equally glad/ pleased/ (so) nice to meet you/ happy to meet you.
 పై మాటలనేప్పుడు, తెలుసు కదా, కరచాలనం (Shakehand) చేస్తాం.
Glad to/ nice to meet you అనే బదులు, Glad/ nice/ pleasure meeting you అని కూడా అంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో పరిచయమైన ఇద్దరు వ్యక్తులూ, Hi, Hi తో సరిపెట్టుకోవచ్చు. ఇలా.
Sekhar: Praksh, meet my friend Bhanu. Bhanu, this is Prakash, my cousin.
Prakash: Hi
Bhanu: Hi
మరో విధంగా:
Rama: Hi 
Sheriff, you haven't met Sasikanth, have you ?
(శశికాంత్‌ను షరీఫ్‌కు పరిచయం చేస్తూ) నువ్వింతకు ముందు శశికాంత్‌ను కలుసుకోలేదు కదా ?
Sheriff: Oh, no, I haven't had the pleasure. Hi Sasikanth.
Rama: (Pointing to Sheriff) Sasikath, Sheriff, my friend.
Sasikanth: What a pleasure meeting you!  (కలుసుకున్నందుకెంత సంతోషంగా ఉందో !)

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND