Moratorium: మారటోరియంపై బ్యాంకులకు కీలక ఆదేశాలు ఇచ్చిన ఆర్‌బీఐ
RBI on moratorium | మీరు ఈఎంఐలపై మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటున్నారా? మీ ఈఎంఐలను వాయిదా వేస్తున్నారా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది.
అన్ని రకాల టర్మ్ లోన్ ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కీలక ఆదేశాలు ఇచ్చింది. మారటోరియం సదుపాయం రుణగ్రహీతలందరికీ ఇవ్వాలని ఆదేశించింది. అంటే కస్టమర్లు వద్దు అనుకుంటే తప్ప మారటోరియం అందరికీ వర్తించేలా చేయాలని ఆర్‌బీఐ ఆదేశాల సారాంశం. ప్రస్తుతం చాలావరకు బ్యాంకులు కేవలం దరఖాస్తు చేసిన కస్టమర్లకు మాత్రమే మారటోరియం వర్తించేలా నిర్ణయం తీసుకున్నాయి. మారటోరియంను డిఫాల్ట్‌గా వర్తించేలా చేయాలని ఇప్పుడు ఆర్‌బీఐ ఆదేశించింది. ప్రస్తుతం వేర్వేరు బ్యాంకులు మారటోరియం విషయంలో వేర్వేరు పద్ధతుల్ని పాటిస్తున్నాయి. దరఖాస్తు చేసే విధానం కూడా వేర్వేరుగా ఉంది. కేవలం మారటోరియం అడిగిన వారికి మాత్రమే వర్తించేలా బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. కానీ ప్రస్తుతం ఆర్‌బీఐ ఆదేశాలు భిన్నంగా ఉన్నాయి
ఆర్‌బీఐ ఆదేశాలు అమలులోకి వస్తే మారటోరియం రుణగ్రహీతలందరికీ వర్తిస్తుంది. కాబట్టి మారటోరియం వద్దు అనుకునేవారు తప్పనిసరిగా బ్యాంకుకు సమాచారం అందించి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అయితే మార్చి 27న ఆర్‌బీఐ జారీ చేసిన ఆదేశాలు భిన్నంగా ఉన్నాయి. అర్హులైన రుణగ్రహీతలకు వెసులుబాటు కల్పించేందుకు బ్యాంకులు, రుణాలు ఇచ్చే సంస్థలు బోర్డు ఆమోదంతో విధానాలను రూపొందించాలని ఆర్‌బీఐ కోరింది. ఇప్పుడు మాత్రం రుణగ్రహీతలందరికీ మారటోరియం వర్తింపజేయాలని, మారటోరియం వద్దు అనుకునేవారు బ్యాంకును సంప్రదించి ఈఎంఐ చెల్లించాలని చెబుతోంది.

No comments:
Post a Comment