జులై 31 వరకు ఆలస్య రుసుములు లేవు
కేంద్ర రవాణా శాఖ ఉత్తర్వులు
దిల్లీ: లాక్‌డౌన్ వల్ల తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా వాహనాలకు సంబంధించిన పలు పత్రాల చెల్లుబాటు గడువును జులై 31 వరకు పెంచినట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ఆదివారం ప్రకటించింది.
నవీకరణ కోసం చేసిన దరఖాస్తులు ఫిబ్రవరి ఒకటి నుంచి పెండింగ్‌లో ఉన్నట్టయితే వాటికి సంబంధించి ఎలాంటి అదనపు/ఆలస్య రుసుములు వసూలు చేయబోరని తెలిపింది.
ఫిబ్రవరి ఒకటి నుంచి జులై 31 వరకు రుసుముల చెల్లింపు ఆలస్యమయినా ఎలాంటి అదనపు/ఆలస్య రుసుములు ఉండబోవని పేర్కొంది. ఫిబ్రవరి ఒకటో తేదీకి ముందు సొమ్ము చెల్లించి, పత్రాల సిద్ధం కాకపోయినా ఆ రుసుము చెల్లుబాటయినట్టుగా పరిగణిస్తామని అధికారులు తెలిపారు.

No comments:
Post a Comment