ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య
➧ప్రాథమిక పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్వ ప్రాథమిక విద్య(ప్రీ స్కూల్స్)ను ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.
➧ ఇందులో భాగంగా సమగ్ర శిక్ష అభియాన్ కింద 3,400 పాఠశాలల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పూర్వ ప్రాథమిక విద్యకు అవసరమయ్యే పాఠ్యాంశాల రూపకల్పనపైనా కసరత్తు చేస్తున్నారు.
➧ నాలుగున్నరేళ్లు, ఐదేళ్ల పిల్లలకు మొదట పూర్వ ప్రాథమిక విద్యలో ప్రవేశాలు కల్పిస్తారు.
➧ ఇక్కడ ఏడాదిపాటు పఠన, లేఖన నైపుణ్యాలు, గణిత సామర్థ్యాలు వంటివి నేర్పిస్తారు. అనంతరం ఒకటో తరగతిలో చేర్పిస్తారు.
➧ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగేందుకు, విద్యార్థులు చదువులో రాణించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
➧ పూర్వప్రాథమిక ఉపాధ్యాయులను ఒప్పంద ప్రతిపాదికన తీసుకుంటారు.
★ మొదట గిరిజన, వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
★ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే మొత్తం అన్ని బడుల్లోనూ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

No comments:
Post a Comment