అకడమిక్ క్యాలెండర్లో మార్పులు అనివార్యం
• సీబీఎస్ఈ తరహాలో రాష్ట్ర స్కూళ్లూ ఆరంభం
• సెలవుల తగ్గింపు, సిలబస్ కుదింపు
• పరీక్షల విధానంలోనూ మార్పులు !
రాష్ట్రంలో పాఠశాలలను ఆగస్టు 3 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 2020-21 అకడమిక్ క్యాలెండర్ విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. విద్యాహక్కు చట్ట ప్రకారం పనిదినాలు ఉండేలా చూస్తూనే సెల వులు, ఇతర అంశాలపై దృష్టి పెట్టింది. విద్యాసంవత్సరం ఆల స్యంగా ప్రారంభమవుతున్నందున అకడమిక్ క్యాలెండర్‌లో మా ర్పులు అనివార్యమవుతున్నాయి. ఆగస్టులోనే సీబీఎస్ఈ స్కూళ్లు కూడా తెరుచుకోనుండడంతో అదే తరహాలో రాష్ట్ర స్కూళ్లు కూడా నడవనున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం అకడమిక్ క్యాలెండర్ లో మార్పులు ఇలా ఉండే అవకాశం ఉంది._
► సాధారణంగా జూన్ 12 నుంచి స్కూళ్లు ప్రారంభమైతే 83 సెలవు రోజులు ఉంటాయి. 230 పని రోజుల్లో ఆప్షనల్, స్థానిక సెలవులు తీసేస్తే 222 రోజులు స్కూళ్లు జరుగుతాయి.
► ఈసారి ఆగస్టు వరకు సెలవులు కొనసాగనున్నందున విద్యార్థులకు ఆన్లైన్ మోడ్లో విద్యాపరమైన కార్యక్రమాలు అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
► దూరదర్శన్, ఆకాశవాణి, వెబ్ నార్, లోకల్ టీవీ నెట్వర్కుల ద్వారా ఈ ఏర్పాట్లు చేపట్టనుంది. ఆగస్టు నుంచి రెగ్యులర్‌గా స్కూళ్లు పనిచేస్తాయి. కనుక ఈలోగా విద్యార్థులకు పాఠ్యాంశాలపై ఆన్లైన్ ద్వారా అవగాహన కల్పిస్తారు.
► అభ్యాస్ వంటి యాప్స్ ద్వారా విద్యార్థులు, టీచర్లకు శిక్షణ, అవగాహన కొనసాగిస్తారు.
► డిజిటల్ ఎడ్యుకేషను సంబంధించి సమగ్ర ప్రణాళికను విద్యాశాఖ రూపొందించనుంది.
► అకడమిక్ క్యాలెండర్ను పునఃసమీక్షించి సెలవుల తగ్గింపు, అందుబాటులో ఉన్న పనిదినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను పూర్తి చేసేందుకు సిలబస్ కుదింపు, పరీక్షల ప్యాట్రన్లోనూ మార్పులు చేయనున్నారు.

No comments:
Post a Comment