ARTS and CULTURE Education
Theatre Arts విభాగం లో విద్యార్థులకు ఉపయోగపడే చక్కని You Tube వీడియో లెస్సన్స్ అందిస్తున్న జాన్సన్ మాస్టర్ .WW (WE WIN ZPHS UK channel ) ను Subscribe చేసుకోండి.
క్రింది లింక్ పై క్లిక్ చేయండి...
➖➖➖➖➖➖➖
https://www.youtube.com/channel/UCtDrGDIMMbLSFMGQgRo7CTA
➖➖➖➖➖➖➖
జాన్సన్ మాస్టర్ గురించి క్లుప్తంగా
తూర్పుగోదావరి కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సిద్ధాంతపు బెన్ జాన్సన్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ప్రభుత్వ పాఠశాలల విద్యాబోధనలో ఇతర భోదనాంశాలలో భాగంగా ఆర్ట్ అండ్ కల్చర్ అంశంలో విద్యార్థులతో రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొలిసారిగా యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించారు. దీనికి గ్రామస్తులు నిధులు సమకూర్చారు.సెల్ ఫోను రిపేరు షాపులను సంప్రదించి పాత ఆండ్రాయిడ్ ఫోన్లను సేకరించారు. వియ్ విన్ జెడ్ పి హెచ్ ఎస్ కొత్తపల్లి అనే యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. విద్యార్థులకు యాంకరింగ్ లోను, ఎడిటింగ్ లోను, కెమేరా ఆపరేటింగ్ లోను శిక్షణ ఇచ్చారు.వారిచేత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయించారు.
ప్రస్తుతం వీరు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ థియేటర్ ఆర్ట్స్ పై అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్ విద్యాబోధన ద్వారా ధియేటర్ ఆర్ట్స్ పై అవగాహన కల్పిస్తున్నారు. బెన్ జాన్సన్ మాస్టారు తయారు చేసిన విద్యార్దులు ఎందరో షార్ట్ ఫిలింలు తీస్తూ పేరు తెచ్చుకుంటున్నారు.కరవోకే సింగింగ్ పైన అవగాహన కల్పించి గాయకులను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఆన్లైన్ లోనే విధ్యార్దులకు క్లాసులు నిర్వహిస్తున్నారు.ఉపాధ్యాయులు వీరి ఆన్లైను క్లాసులను అనుసరిస్తూ డిజిటల్ విధ్యాభోధనపై అవగాహన పెంచుకుంటున్నారు. ఇంతకుముందు వీరికి ధ్రువ తార అనే పాఠశాల ప్రత్రికను రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల చరిత్రలో సుదీర్ఘకాలం నడిపిన అనుభవం ఉంది. విద్యార్థులకు ప్రస్తుత వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్ విద్యాబోధన చేయుచున్నారు. మాస్టారు ధియేటర్ ఆర్ట్స్ పై విధ్యార్దులను నిష్ణాతులను చేస్తున్నారు.
No comments:
Post a Comment