గ్రామ సచివాలయాల్లో ఆధార్ సేవలు
కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్
❇️ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే ఏ సంక్షేమపథకం ద్వారా లబ్ధి పొందాలన్నా.. వ్యక్తిగత
ఆధారాల కోసం, ఇతర బ్యాంక్ వ్యవహారాల కోసం ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది.
❇️అయితే, ఈ కార్డుల జారీలో జరుగుతున్న జాప్యం, తప్పులు, ఇతర ఇబ్బందులను సరి చేసుకునే ప్రక్రియలో ప్రజలు పడుతున్న అవస్థలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
❇️ఇప్పటికే ప్రజా సంక్షేమానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ సర్కార్ తాజాగా ఆధార్ కార్డుల విషయంలో కూడా మరో అడుగు ముందుకు వేసింది. రాష్ట్ర ప్రజలందరికీ ఆధార్ కార్డుల జారీ, వాటిలో
సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేసుకునేందుకు ఇకపై గ్రామ సచివాలయాల ద్వారా ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
❇️ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు ఇకపై ఈ సేవ కేంద్రాలు, ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏమాత్రం ఉండదు. ప్రస్తుతం మండలానికి లేదా ముఖ్య పట్టణాలకే ఒక్క ఆధార్ సేవా కేంద్రం ఉంటున్న నేపథ్యంలో ప్రజలు అక్కడ రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి
ఉంది. ఈ కష్టాలన్నింటికీ చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ,వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవా కేంద్రాలను ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకుంది.
❇️దీనికి అవసరమైన ప్రణాళికలను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. త్వరలోనే కొత్త ఆధార్
కార్డుల జారీ, మార్పులు, చేర్పులు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందుబాటులోకి రానున్నాయి.
❇️ప్రస్తుతం కేవలం పోస్టా
ఫీసులు, కొన్ని బ్యాంకుల్లో మాత్రమే ఆధార్ సేవా కేంద్రాలు
ఉన్నాయి. అక్కడ కూడా టోకెన్ విధానాన్ని అమలు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
❇️రోజుకు కేవలం యాభైమంది చొప్పున బ్యాంకులు, పోస్టాఫీసులు ఆధార్ సేవలు అందిస్తున్నప్పటికీ.. అవి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న
ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రాష్ట్ర ప్రజల కష్టాలకు స్వస్తి చెప్పే చర్యలు చేపడుతోంది.

No comments:
Post a Comment