అంగన్‌వాడీల్లో ‘నాడు-నేడు’
అన్ని కేంద్రాల్లో 10 రకాల సదుపాయాలు: సీఎం జగన్
అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా నాడు నేడు కార్యక్రమాలు చేపట్టాలని, స్కూళ్ల తరహాలోనే 10 రకాల సదుపాయాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో మహిళ శిశు సంక్షేమశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అంగన్ వాడీ కేంద్రాలను మరింత పటిష్టం చేయాలని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, 36 నెలల్లోపు శిశువులకు, 36 నెలల నుంచి 72 నెలల పిల్లలకు వేరు వేరుగా ఉండేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ లో కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్కూళ్లలోనే ప్రీ ప్రైమరీ బోధన ఉంటే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ 2 సిలబస్ పైనా పరి శీలన చేయాలని, అంగన్ వాడీ పిల్లల లెర్నింగ్ స్కిల్స్ కోసం టూల్స్, టీవీ ప్రత్యేక పుస్తకాలు ఉండాలన్నారు. ప్రసవం కాగానే మహిళలకు అందా ల్సిన ఆరోగ్య ఆసరా రూ.5 వేలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధి కారులను సీఎం ఆదేశించారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అమలు తీరుపై బలమైన పర్యవేక్షణ ఉండాలన్నారు. అంగన్వాడీల్లో ఎక్కడ భోజనం చేసినా ఒకేలా ఉండాలన్నారు. అంగన్వాడీలను బాగా నిర్వహి స్తున్న వారిని ప్రోత్సహించాలన్నారు. ఈ సమీక్షలో మంత్రి తానేటి వనిత సీఎస్ నీలం సాహ్ని, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి పీఆర్ అనురాధ, డైరెక్టర్ కృతికాశుక్ల, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment