తల్లిదండ్రులదే అసలు బాధ్యత !-
అప్పుడే ‘విద్యా వారధి’ పాఠాలు సఫలం
డీడీ సప్తగిరి ఛానల్‌లో రోజూ ప్రసారం
➧కరోనా నేపథ్యంలో ‘విద్యా వారధి’ పేరుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న దృశ్య శ్రవణ పాఠాల ఫలితం విద్యార్థుల తల్లిదండ్రుల ఆసక్తి మీదే ఆధారపడి ఉంటాయని నిపుణులు అంటున్నారు. డీడీ సప్తగిరి ఛానల్‌లో రోజూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు (మధ్యలో ఓ గంట మినహా) ఈ వీడియో తరగతులు ప్రసారమవుతున్నాయి. విద్యార్థులకు వచ్చే సందేహాల నివృతికి ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేసింది.
➧ఒకటి నుంచి పదో తరగతి వరకు.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు కదలలేని పరిస్థితి ఉన్నందున పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్షా సంయుక్తంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు వీడియో తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లోని పాఠ్యాంశాలను బోధించేందుకు షెడ్యూల్ ఖరారు చేసి బోధన ప్రారంభించింది. వీడియో తరగతులను విద్యార్థులు చూస్తున్నదీ లేనిదీ ఉపాధ్యాయులు పర్యవేక్షించాల్సి ఉంది. తమ పిల్లలు పాఠాలు చూసేలా తల్లిదండ్రులు ప్రధానంగా శ్రద్ధ వహించాల్సి ఉంది.
సందేహాలు నివృత్తి చేసుకోవాలి
విద్యార్థులు ఆన్‌లైన్ పాఠాలు విన్నతర్వాత తమ సందేహాలను హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి తీర్చుకోవాలి. పాఠాలు వినేప్పుడు వచ్చే సందేహాలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకుని హెల్ప్‌లైన్ నంబరును వినియోగించుకోవాలి.
అందుబాటులో హెల్ప్‌లైన్ నంబర్
విద్యార్థులు 1800123123124 హెల్ప్‌లైన్ నంబరుకు ఫోన్‌చేసి సప్తగిరి ఛానల్ ద్వారా విన్న పాఠ్యాంశాల సందేహాలను నివృతి చేసుకోవచ్ఛు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంటుంది.

No comments:
Post a Comment