Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలు

* *సందేహం:**
*ఒక ST ఉపాధ్యాయుని అన్న ప్రభుత్వోదోగిగా ఉన్నారు. ఆ ఉపాధ్యాయుని కి ఇన్ సర్వీసులో ఉన్నత చదువులు చదవడానికి ఫస్ట్ జనరేషన్ సర్టిఫికెట్ పొందడానికి అర్హత ఉంటుందా?*

* సమాధానం:*
*అర్హత ఉంటుంది. తాత లేక తండ్రి ఉద్యోగస్థులైతే అర్హత ఉండదు. కానీ వారు ఉద్యోగులు కాకపోయినట్లయితే ప్రస్తుత తరంలో ఎంతమంది అన్నదమ్ములు ఉద్యోగులైనప్పటికి వారందరికీ ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్ పొందే అర్హత ఉంటుంది. ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ కమీషనర్ Rc.No.860/Ser.4-3/2018 తేది: 12.01.2018 ద్వారా వివరణ ఇచ్చారు.*


 *సందేహం:*
*ఒక ఉద్యోగి సస్పెన్షన్ లో ఉంటూ అనారోగ్య కారణాలతో చనిపోయిన సంధర్భంలో అతని కుటుంబానికి ఉద్యోగం ఇవ్వవచ్చునా?సస్పెన్షన్ కాలాన్ని ఎలా పరిగణిస్తారు?*

 *సమాధానం:*
*సస్పెండైన ఉద్యోగి క్రమశిక్షణా చర్యలు పూర్తికాకుండానే చనిపోయిన సంధర్భంలో అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వవచ్చు.సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీ క్రింద పరిగణించి అతనికి రావాలసిన జీతభత్యాలు అతని వారసులకు చెల్లించాలని ప్రభుత్వం జీవో.275,F&P,తేది:8-8-1977 ద్వారా సూచించింది.*


సందేహము:
*చైల్డ్ కేర్ లివ్ ఒక స్పెల్ కు మాగ్జిమం ఎన్ని రోజులు  పెట్టుకోవచ్చు. 1,2 రోజులు కూడా పెట్టుకోవచ్చునా ?*

సమాధానము:
*G.O.Ms.No.209 Fin తేది:21.11.2016 ప్రకారం వివాహిత మహిళా ఉపాధ్యాయులు ప్రతి స్పెల్ కు మాగ్జిమం 15 రోజుల చొప్పున 6 స్పెల్ లకు తగ్గకుండా 90 రోజులు వాడుకోవచ్చును. జీవోలో 6 స్పెల్ లకు తగ్గకుండా అన్నారు కాబట్టి 1,2 రోజులు కూడా వాడుకొనవచ్చును.*


 సందేహము:
*చైల్డ్ కేర్ లివ్ ముందుగానే మంజూరు చేయించుకోవాలా? సెలవు కాలంలో పూర్తి జీతం చెల్లిస్తారా ?*

 సమాధానము:
*చైల్డ్ కేర్ లివ్ ను DDO తో ముందుగానే మంజూరు చేయించుకుని, ప్రొసీడింగ్స్ ద్వారా వివరాలను సర్వీసు పుస్తకములో నమోదు చేయించుకోవాలి.ఆ నెల వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాలసీన బాధ్యత DDO దే.*


 సందేహము:
*చైల్డ్ కేర్ లివ్ పెట్టిన సెలలో ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే మంజూరు చేయవచ్చునా ?*

సమాధానము:
*వీలుపడదు. సెలవు కాలంలో వేతన వృద్ధి ఉండదు.కావున సెలవు అనంతరం విధులలో చేరిన నాటినుండే ఇంక్రిమెంట్ మంజూరుచేస్తారు.*


 సందేహము:
*మెటర్నిటి లీవుకు కొనసాగింపుగా చైల్డ్ కేర్ లీవు పెటుకోవచ్చునా ?*

 *సమాధానము:*
*చైల్డ్ కేర్ లీవును అన్ని విధాలుగా  Other than casual,spl. casual leave తో కలిపి పెట్టుకోవచ్చునని జీవో.209 లోని రూలు 3(i) సూచిస్తోంది.*


 *సందేహము:*
*సర్రోగసి, దత్తత ద్వారా సంతానం పొందిన మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లివ్ కు అర్హులేనా ?*

 *సమాధానము:*
*అర్హులే, 90 రోజుల సెలవు వాడుకొనవచ్చును.*


 *సందేహము:*
*భార్య మరణించిన పురుష ఉద్యోగికి చైల్డ్ కేర్ లివ్ మంజూరు చేయవచ్చునా ?*

 *సమాధానము:*
*వీలు లేదు. ఇందుకు సంబంధించిన GO.209 లో *Women Employees* *అని ఉన్నది.*
*

 *సందేహము:*

*చైల్డ్ కేర్ లీవ్ కు అప్లై చేసిన ప్రతిసారి పుట్టినతేది వివరాలు సమర్పించాలా?*

 *సమాధానము:*
*అవసరం లేదు. మొదటి సారి అప్లై చేసేటపుడు మాత్రమే కుమారుడు/కుమార్తె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రతి దఫా అప్లికేషన్ సమర్పిస్తే సరిపోతుంది.*


 *సందేహము:*

*పిల్లల అనారోగ్యం, చదువుల కొరకు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేస్తారా ?*

 *సమాధానము:*
*GO.209 point.3 లో  ఇలా ఉన్నది "Children needs like examinations, sickness etc", అని ఉన్నది కావున పై రెండు కారణాలకే కాకుండా ఇతరత్రా కారణాలకు కూడా చైల్డ్ కేర్ లీవు మంజూరు చేయవచ్చును.*


 *సందేహము:*

*చైల్డ్ కేర్ లీవ్ కు ప్రిఫిక్స్,సఫిక్స్  వర్తిస్తాయా ?*

 *సమాధానము:*
*వర్తిస్తాయి, ప్రభుత్వ సెలవు దినాలతో ఇట్టి సెలవును అనుసంధానం చేసుకోవచ్చును*

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND