దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు
5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలా ప్రణాళిక
దసరా, సంక్రాంతి సెలవులను తగ్గిస్తూ 181 రోజుల పనిదినాలు వచ్చేలా పాఠశాల విద్యా శాఖ అకడమిక్ కేలండర్‌ను సిద్ధం చేసింది. వచ్చే నెల 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలా దీన్ని రూపొందించారు. ఈ ఏడాదికి సాధారణంగా 220 రోజులు పాఠశాలల పనిదినాలు ఉండాల్సి ఉండగా.. కరోనాతో విద్యా సంస్థలు తెరుచుకోలేదు. జూన్ 13 నుంచి పునఃప్రారంభం కావాల్సిన బడులను వచ్చే నెల నుంచి తెరవనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకనుగుణంగా అకడమిక్ కేలండర్‌ను సిద్ధం చేశారు. దసరాకు ఐదు, సంక్రాంతికి ఆరు రోజులు సెలవులు ఇవ్వనున్నారు. పాఠ్యాంశాలను 30శాతం వరకు తగ్గించనున్నారు.
పరీక్షలు..
➧అక్టోబరులో నిర్మాణాత్మక మూల్యాంకనం (ఫార్మెటివ్)-1 పరీక్ష నిర్వహిస్తారు.
➧వచ్చే ఏడాది జనవరిలో సంగ్రహణ్మాతక మూల్యంకనం (సమ్మెటివ్)-1
➧మార్చిలో ఫార్మెటివ్-2
➧ఏప్రిల్‌లో సమ్మెటివ్-2
సెలవులు ఇలా..
➧అక్టోబరు 22 నుంచి 26 వరకు దసరా సెలవులు.
➧మిషనరీ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 24 నుంచి 28 వరకు.
➧వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు.

No comments:
Post a Comment