బీపీఈడీ చదివేందుకు అవకాశం: డీఈవో
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పీఈటీలకు బీపీఈడీ చదివేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు డీఈవో ఎస్.అబ్రహం తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల్లో మూడేళ్లు నిరాటకంగా సర్వీసు ఉన్న పీఈటీలు అర్హులన్నారు. అర్హులైన ఉపాధ్యాయులు 2020-21, 2021-22 విద్యా సంవత్సరాల్లో ఇన్ సర్వీసులో బీపీఈడీ కోర్సు చేయవచ్చునన్నారు. బీపీఈడీ కోర్సులో ప్రవేశ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసి, 15 రోజుల లోపు అనుమతి దరఖాస్తును సంబంధిత తనిఖీ అధికారుల ద్వారా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి సమర్పించాలని డీఈవో సూచించారు.

No comments:
Post a Comment