ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
➧డిపార్ట్మెంట్ పరీక్షల్లో మైనస్ మార్కులు ఎత్తివేసే యోచన
➧త్వరలో సీఎంను కలవనున్న ఉద్యోగ సంఘాలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపి కబురు అందనుంది. పదోన్నతులు, ఇంక్రిమెంట్లకు నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షల్లో మైనస్ మార్కులు ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొద్దిరోజుల్లోనే దీనిపై తుది నిర్ణయం వెలువడనున్నట్లు తెలిసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిపార్ట్మెంట్ పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఈ ఏడాది మేలో జరగాల్సిన పరీక్షలను నిర్వహించలేదు. త్వరలో జరగాల్సిన పరీక్షలు అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. వైరస్ మరింత వ్యాప్తి చెందిన నేపథ్యంలో మరోసారి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈసారి ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో సచివాలయ ఉద్యోగులతో సహా సుమారు లక్షా 70 వేల మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.ఏపీపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్షల్లో వివిధ విభాగాల్లో మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో 35 మార్కులు పొందితే ఇంక్రిమెంట్లు, పదోన్నతులకు అర్హత సాధించినట్లే అయితే తప్పులు, క్రమశిక్షణ ఇతర రికార్డులు పరిగణనలోకి ఉంటే 1/3 మైనస్ మార్కులు మినహాయిస్తారు. ఈ కారణంగా ఏటా పది శాతం మంది కూడా ఇంక్రిమెంట్లకు నోచుకోవటం లేదు. దీంతో మైనస్ మార్కులను ఎత్తివేయాల్సిందిగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. కరోనా విధుల్లో నిమగ్నమైన ఉద్యోగులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం లేదని, ఈ నెల 25న శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నందున వాయిదా వేయడమే శ్రేయస్కరమన్నారు.

No comments:
Post a Comment