Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

పెండింగ్ లో ఉన్న 4 వేల SGT ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి హైకోర్ట్ లైన్ క్లియర్!

 పెండింగ్ లో ఉన్న 4 వేల SGT ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి  హైకోర్ట్ లైన్ క్లియర్!
త్వరలో ప్రక్రియ మళ్లీ ప్రారంభం.
డీఎస్సీ-2018 నిర్వహించి దాదాపు రెండేళ్లు కావస్తున్నా,ఇంతవరకూ అన్ని పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఈ కారణంగా... కొత్త డీఎస్సీ ప్రకటన నిలిచిపోయింది. ఫలితంగా నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పట్లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, కరోనా ప్రభావంతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతుందంటున్న అధికారులు.. ఆ మేరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియామకాలు పెండింగ్‌లో పడుతున్నాయి.
సగానికిపైగా..
➤డీఎస్సీ-2018లో 7,902 పోస్టులు ప్రకటించగా.. ఇప్పటికీ భర్తీకానివే 4,481 ఉన్నాయి.
➤తొలిసారిగా గత డీఎస్సీకి ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించారు. దీంతో ఎస్జీటీ పరీక్షలు 16 సెషన్లలో జరిగాయి.
➤ఒక విడతలో ప్రశ్నపత్రం తేలిగ్గా, మరో విడతలో కఠినంగా వచ్చిందని.. మొత్తం పరీక్షను సాధారణీకరణ (నార్మలైజేషన్‌) చేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
➤ఈరోజు న్యాయస్థానం వీరి వాదనను కొట్టివేసింది.
➤ 2018 సెలెక్టెడ్ అభ్యర్థులకు మరియు ప్రభుత్వ అనుకూల తీర్పు రావటంతో ఇక నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుంది.


No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND