Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

పెండింగ్‌లోనే 4,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ

పెండింగ్‌లోనే 4,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
➧న్యాయ వివాదాలతో నిలిచిన నియామకాలు
➧విద్యార్థుల సంఖ్య పెరిగితే బోధన కష్టమే
 డీఎస్సీ-2018 నిర్వహించి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకూ అన్ని పోస్టులనూ భర్తీ చేయలేదు. దీంతో కొత్త డీఎస్సీ ప్రకటన నిలిచిపోయింది. ఫలితంగా నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పట్లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, కరోనా ప్రభావంతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతుందంటున్న అధికారులు.. ఆ మేరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుల భర్తీ ప్రకటన సమయంలో అధికారులు చేస్తున్న పొరపాట్లవల్ల న్యాయ వివాదాలు ఏర్పడుతున్నాయి. దీంతో నియామకాలు పెండింగ్‌లో పడుతున్నాయి.
సగానికిపైగా..
➤డీఎస్సీ-2018లో 7,902 పోస్టులు ప్రకటించగా.. ఇప్పటికీ భర్తీకానివే 4,481 ఉన్నాయి.
➤తొలిసారిగా గత డీఎస్సీకి ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించారు. దీంతో ఎస్జీటీ పరీక్షలు 16 సెషన్లలో జరిగాయి.
➤ఒక విడతలో ప్రశ్నపత్రం తేలిగ్గా, మరో విడతలో కఠినంగా వచ్చిందని.. మొత్తం పరీక్షను సాధారణీకరణ (నార్మలైజేషన్‌) చేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
➤భాషా పండితులు, స్కూల్‌ అసిస్టెంట్లు (భాషలు) పోస్టుల విషయంలోనూ వివాదం ఏర్పడింది.
➤ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్ల పోస్టులకు గతంలో పనిచేసిన సమయంలో నిర్దిష్టమైన వేతనం ఉండాలన్న నిబంధన పెట్టారు. ప్రైవేటులో పనిచేసిన వారికి అంత వేతనం లేదంటూ వేతనాన్ని తగ్గిస్తూ మరో సవరణ ఉత్తర్వు జారీచేశారు. ఇది న్యాయ వివాదానికి దారి తీసింది.
➤వ్యాయామ ఉపాధ్యాయులకు మొదటిసారిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించారు. దీనిపై కొందరు న్యాయస్థానానికి వెళ్లారు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND